- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'పాలమూరు'కు శాపం! కోల్డ్ స్టోరేజీలో ప్రాజెక్ట్.. ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర పోస్ట్
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆమె గురువారం ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. 14 నెలలుగా (Palamuru project) పాలమూరు ఎత్తిపోతలను (CM Revanth Reddy) రేవంత్ సర్కార్ కోల్డ్ స్టోరేజీలో పెట్టిందని తెలిపారు. ప్రాజెక్టుకు అనుమతుల సాధనను గాలికొదిలేసిందని ఆరోపించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హయాంలో సాధించిన పర్యావరణ అనుమతులను న్యాయవివాదాల సుడి నుంచి బయటకు తేలేకపోయిందని పేర్కొన్నారు.
ఎంతో ముందు చూపుతో కేసీఆర్ (KCR) పాలమూరుకు 90 టీఎంసీల నికర జలాలు కేటాయించి ప్రాజెక్టును గట్టెక్కించే ప్రయత్నం చేస్తే.. ఆ విషయాన్ని కేంద్రానికి సరిగా చెప్పలేక తుది అనుమతులను ఇంకింత సంక్లిష్టం చేసిందని వెల్లడించారు. వెరసి.. (Krishna River) కృష్ణా జలాల నీటి కేటాయింపులు తేలేవరకు పాలమూరు - రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలేమని పార్లమెంట్ సాక్షిగా కేంద్రం తేల్చిచెప్పిందని వెల్లడించారు. నల్లమల బిడ్డనని చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు.. పాలమూరు ప్రాజెక్టు విషయంలో మీ చిత్తశుద్ధి ఏపాటిదో ఈ రోజు తేలిపోయిందని తీవ్ర విమర్శలు చేశారు. కాగా, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడం ప్రస్తుతం సాధ్యం కాదని తాజాగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను తిరస్కరించింది. ప్రాజెక్టు సాంకేతిక, ఆర్థిక ముదింపు చేయకుండా.. జాతీయ హోదా సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేసింది.






