- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MLC Kavitha: ఆధునిక భారతదేశ నిర్మాత పీవీ.. ఎమ్మెల్సీ కవిత స్పెషల్ ట్వీట్
ఆధునిక భారతదేశ నిర్మాత మాజీ ప్రధాని, భారతరత్న పీవీ నరసింహా రావు అని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆధునిక భారతదేశ నిర్మాత మాజీ ప్రధాని, భారతరత్న పీవీ నరసింహా రావు అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇవాళ ఆయన జయంతి సందర్భంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. క్లిష్ట సమయంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని కాపాడారని కొనియాడారు. అపర చాణక్యుడు, బహుభాషా కోవిదుడు, తెలంగాణ ముద్దు బిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారి జయంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ ఘననివాళులని కామెంట్ చేశారు. దేశంలో ఆర్థిక సరళీకరణను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. విదేశాంగ విధానాన్ని బలోపేతం చేయడంతో పాటు విద్యా రంగాన్ని ముందుకు తీసుకెళ్లడంలో పీవీ చేసిన సేవలు అనుసరణీయమని ఎమ్మెల్సీ కవిత ప్రశంసించారు.
Read More.. ఆర్థిక సంస్కరణల రూపకర్తగా పీవీ కీర్తిగడించారు: నారా లోకేష్
Next Story






