- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Golconda: బోనమెత్తిన ఎమ్మెల్సీ కవిత.. అమ్మవారిని ఏం కోరుకున్నారో తెలుసా?
తెలంగాణ ప్రజలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే బోనాల(Telangana Bonalu) ఉత్సవాల్లో భాగంగా గోల్కొండ బోనాలు మొదలయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రజలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే బోనాల(Telangana Bonalu) ఉత్సవాల్లో భాగంగా గోల్కొండ బోనాలు మొదలయ్యాయి. హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. రాష్ట్రప్రభుత్వం పక్షాన వేదమంత్రాల నడుమ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం ప్రసాదకుమార్ ముఖ్య అతిథులుగా హాజరై అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
మరోవైపు.. బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) కూడా బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. గోల్కొండ జగదాంబిక మహంకాళి, ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండేలా దీవించాలని అమ్మవారిని ప్రార్ధించినట్లు తెలిపారు.
ఈ బోనాలు జూలై 24వ తేదీ వరకు గురు, ఆదివారాల్లో కొనసాగనున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు అనంతరం రాష్ట్ర ప్రభుత్వం దీనిని అధికారిక పండుగగా ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, ఈ యేడాది బోనాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. బోనాల కోసం హైదరాబాద్ జిల్లాలోని 2,332 దేవాలయాలకు, రంగారెడ్డి జిల్లాలోని జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 451 దేవాలయాలకు ప్రభుత్వం రూ.20 కోట్ల నిధులను కేటాయించింది. ఫొటోస్






