- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేవంత్ సర్కార్ మరోసారి బీసీలను వంచిస్తోంది: ఎమ్మెల్సీ కవిత
రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరోసారి బీసీలను వంచిస్తోందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ చట్ట సవరణ చేస్తున్నామని చెప్పడం అంటే సాంకేతిక అంశాలను అడ్డం పెట్టుకొని బీసీలకు రిజర్వేషన్ల పెంపు ఫలాలు దక్కకుండా చేయడమే అని విమర్శించారు.

దిశ, వెబ్ డెస్క్: రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరోసారి బీసీలను వంచిస్తోందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ చట్ట సవరణ చేస్తున్నామని చెప్పడం అంటే సాంకేతిక అంశాలను అడ్డం పెట్టుకొని బీసీలకు రిజర్వేషన్ల పెంపు ఫలాలు దక్కకుండా చేయడమే అని విమర్శించారు. ‘‘మేం రిజర్వేషన్లను పెంచాం.. కోర్టు కొట్టేసింది..’’ అనే నెపం వెతుక్కునే ప్రయత్నాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టు ప్రతి ఒక్కరికీ అర్థమవుతున్నదని అన్నారు. అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదించిన బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులు చట్టరూపం దాల్చేలా ప్రధానిపై ఒత్తిడి తేవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనీస ప్రయత్నాలు చేయలేదని ఆరోపించారు.
ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లలేదని, కేబినెట్ తీర్మానంపై ఆర్డినెన్స్ ఇచ్చేలా గవర్నర్ ను కలిసి డిమాండ్ చేయలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం, గవర్నర్ బీసీల రిజర్వేషన్ల పెంపును తొక్కిపెట్టినా సుప్రీం కోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం చేయలేదని మండిపడ్డారు. ఇప్పుడు కూడా బీసీ రిజర్వేషన్లు పెంచినట్టు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారే తప్ప వాటి ఫలాలు ఆ కులాలకు దక్కాలన్న చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఏమాత్రం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వంచన రాజకీయాలను బీసీలు అర్థం చేసుకోలేరు అనుకోవడం అవివేకమే అవుతుందన్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలు కాంగ్రెస్ పార్టీకి కర్రుకాల్చి వాత పెట్టి తీరుతారని హెచ్చరించారు.






