షకీల్ ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

by velandi.Saikiran |

గులాబీ పార్టీ మాజీ ఎమ్మెల్యే షకీల్ ( Shakeel) ఇంటికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( Kalvakuntla kavitha) వెళ్లారు. ఈ సందర్భ

షకీల్ ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత
X

దిశ, వెబ్ డెస్క్ : గులాబీ పార్టీ మాజీ ఎమ్మెల్యే షకీల్ ( Shakeel) ఇంటికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( Kalvakuntla kavitha) వెళ్లారు. ఈ సందర్భంగా షకీల్ కుటుంబాన్ని పరామర్శించారు కల్వకుంట్ల కవిత. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఇంటికి కాసేపటి క్రితమే గులాబీ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అలాగే ఆమె భర్త అనిల్ కుమార్ ( Anil Kumar) ఇద్దరు వెళ్లారు. ఇటీవల అనారోగ్యంతో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తల్లి కన్నుమూసిన సంగతి తెలిసిందే.

ఆ సమయంలో షకీల్ ను కల్వకుంట్ల కవిత కలవలేకపోయారు. అయితే తాజాగా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు కవిత. ఈ సందర్భంగా షకీల్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఎమ్మెల్సీ కవిత. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కాగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన గులాబీ నేతలు అందరితో కల్వకుంట్ల కవిత నిత్యం టచ్ లోనే ఉంటారు. గతంలో నిజామాబాద్ ఎంపీగా కల్వకుంట్ల కవిత పనిచేసిన అప్పటినుంచి.. ఈ పరిస్థితి నెలకొంది. మొన్న పార్లమెంట్ ఎన్నికల సమయంలో కల్వకుంట్ల కవిత జైలు పాలు కావడంతో ఆమెకు.. పోటీ చేసే ఛాన్స్ రాలేదు.

Next Story