MLC Kavitha: బీసీ కులగణనపై కాకి లెక్కలు.. అసలు విషయం చెప్పిన ఎమ్మెల్సీ కవిత!

by Ramesh Naini |   (  Updated:2025-02-03 07:31:36  IST  )

బీసీ కుల గణనపై కాంగ్రెస్ ప్రభుత్వం కాకి లెక్కలు చెప్పిందని విమర్శించారు.

MLC Kavitha: బీసీ కులగణనపై కాకి లెక్కలు.. అసలు విషయం చెప్పిన ఎమ్మెల్సీ కవిత!
X

దిశ, కరీంనగర్ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: బీసీ కుల గణన (caste census)పై కాంగ్రెస్ ప్రభుత్వం కాకి లెక్కలు చెప్పిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ (MLC Kavitha) విమర్శించారు. కుల గణన నివేదికపై సోమవారం ఆమె కరీంనగర్‌లో మాట్లాడారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో 83 లక్షల ఇండ్లు ఉన్నట్లు చెప్పారు. ఆనాడు కేంద్ర ప్రభుత్వం తేల్చిన జనాభా 3 కోట్ల 50 లక్షలు.. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వేలో ఒక కోటి 3 లక్షల ఇళ్లు, 3 కోట్ల 68 లక్షల జనాభా అని తేలిందని తెలిపారు.కేవలం నాలుగేళ్లలో చేసిన లెక్కలతో 20 లక్షల ఇళ్లు పెరిగాయని వివరించారు. 2014-2024 వరకు పదేళ్ళలో ఎన్ని ఇళ్ళు ఎంత జనాభా ఉండాలి? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల చేసిన సమగ్ర కుల గణనతో కోటి 15 లక్షల ఇళ్లు ఉన్నాయని చెబుతోందన్నారు.

జనాభా మూడు కోట్ల 70 లక్షలు అని చెప్తుందని, 2011 నుంచి 14 వరకు 20 లక్షల ఇల్లు పెరిగితే.. 2014 నుంచి పదేళ్లలో సుమారు 60 లక్షల కుటుంబాలు పెరగాలన్నారు. 2023 వరకు బీఆర్ఎస్ సర్కార్ కళ్యాణ లక్ష్మి చెక్కులే 13 లక్షల 78 వేల ఇచ్చిందని తెలిపారు. ప్రభుత్వం కనీసం 12 లక్షలు పెరిగినట్లు కూడా చూపించడం లేదని ఆరోపించారు. ఏ లెక్కన చూసినా తెలంగాణలో 50 నుంచి 52 శాతం బీసీలు ఉన్నట్లు తెలుస్తుందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 46.2శాతం ఉన్నట్లు తేల్చారని ఆరోపించారు. ఇది కరెక్టా అని సీఎం రేవంత్ రెడ్డి గుండె మీద చేసుకుని చెప్పాలని డిమాండ్ చేశారు. జనాభా లెక్కలపై అనుమానం ఉందని, మీరు చేసిన లెక్కలు కరెక్టే అయితే.. సర్వేలో తానిచ్చిన వివరాలు, నా పేరు ఆధార్ కార్డు కొడితే రావాలని చెప్పారు. మూడు కోట్ల 50 లక్షల మంది సర్వే రిపోర్ట్‌లు వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.

బీసీ జనాభా అంటే చిన్న చూపా..

ఇది చిన్న విషయం కాదు పెద్ద విషయం.. ప్రభుత్వం ఆగమాగం చేస్తుందని మండిపడ్డారు. మంత్రివర్గ సమావేశం వెంటనే అసెంబ్లీ సమావేశం, సమావేశంలో లఘు చర్చనట. బీసీ జనాభా అంటే చిన్న చూపా.. అని ఫైర్ అయ్యారు. మీ లెక్కల ప్రకారమే 46.2 శాతం ముస్లిం మైనార్టీల 10% మొత్తం 56% బీసీలకు రిజర్వేషన్ కల్పించండని డిమాండ్ చేశారు. కులగణనపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇంకా మిస్ అయిన వారి కోసం మళ్ళీ అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 15 రోజుల పాటు రివ్యూకు అవకాశం ఇచ్చి ఎన్ రోల్ చేసుకోని వారికి అవకాశం కల్పించాలని కోరారు.

అసెంబ్లీ తర్వాత బీసీ సంఘాలను కలుపుకొని బీసీ సాధికారత, రాజకీయంగా బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ దక్కే వరకు పోరాడుతామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హృదయం సాఫ్‌గా లేదని చెప్పడానికి కాకి లెక్కలే నిదర్శనమని విమర్శించారు. కేసీఆర్ లెక్క లెక్కగా చెప్పామ్.. కాంగ్రెస్ మాత్రం మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ కట్టుబడి ప్రస్తుతం ప్రకటించిన జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.

Next Story