- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MLC Kavitha: జులై 17న ఢిల్లీకి సెగ తగలాల్సిందే.. ఎమ్మెల్సీ కవిత కీలక ప్రకటన
బీసీ రిజర్వేషన్లపై బిల్లు ఆమోదానికి కేంద్రంపై ఒత్తిడి తీవ్ర తరం చేద్దామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బీసీ రిజర్వేషన్లపై బిల్లు ఆమోదానికి కేంద్రంపై ఒత్తిడి తీవ్ర తరం చేద్దామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) పిలుపునిచ్చారు. ఇవాళ (మంగళవారం) తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ల సాధనకు మెదక్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు ఆమోదం కోసం జులై 17న రైల్ రోకో (Rail Roko) కార్యక్రమం నిర్వహించనున్నట్లు కీలక ప్రకనట చేశారు. అన్ని బీసీ సంఘాల నాయకులను కలుపుకొని రైల్ రోకో చేస్తామన్నారు. ఢిల్లీ పాలకులకు తెలంగాణ బీసీల పౌరుషాన్ని చాటుతామని, ఢిల్లీ పాలనలకు సెగ తాకేలా రైల్ రోకో కార్యక్రమం ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలు నిర్వహించనివ్వబోమని హెచ్చరించారు. 42 రిజర్వేషన్లు ఇవ్వకుండా కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు. బీసీ విద్యార్థులు, మహిళలు ఈ ఉద్యమంలో పెద్ద ఎత్తున కలిసి రావాలని పిలుపునిచ్చారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు తెలంగాణ జాగృతి పోరాటం చేస్తోందని అన్నారు. తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ ఒత్తిడితోనూ అసెంబ్లీలో ప్రభుత్వం మూడు బీసీ బిల్లులు పెట్టిందని అన్నారు. వార్డు మెంబర్, సర్పంచ్‌లు కాని అనేక కులాలు బీసీల్లో ఉన్నాయని, అసెంబ్లీ గడప తొక్కని అనేక కులాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. రాజకీయ అవకాశాల్లో బీసీ మహిళల పరిస్థితి మరింత దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్లలో బీసీలకు ఉప కోటా ఉండాలని డిమాండ్ చేశారు. సమాజంలో 56 శాతం జనాభాకు సంబంధించి హక్కులు కోరుతుంటే అవి మానవ హక్కులు కావా? అని ప్రశ్నించారు. సరైన సమయంలో జాగృతి మాట్లాడింది కాబట్టి అసెంబ్లీలో మూడు బిల్లులు వచ్చాయని, అదే స్పూర్తితో బీసీ బిల్లులను కేంద్రం ఆమోదించేలా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.
ఢిల్లీకి బిల్లు పంపించి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులుదులుపుకుందని విమర్శించారు. మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు బీసీ బిల్లు గురించి ఒక్క రోజు కూడా మాట్లాడలేదన్నారు. రఘునందన్ రావు బీసీల కోసం ఎందుకు మాట్లాడటం లేదు? అని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీ బిల్లును ఎందుకు ఆమోదించడం లేదని ప్రతి ఒక్కరు రఘునందన్ రావును ప్రశ్నించాలన్నారు. కులగణన వివరాలను కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీల వారీగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రౌండ్ టేబుల్ సమావేశానికి రానివ్వకుండా బీసీ నాయకులను మెదక్ లొ కొంత మంది బెదిరించే ప్రయత్నం చేశారని, దీన్ని బట్టి చూస్తే వాళ్ళు భయపడుతున్నట్లు తెలుస్తోందని అన్నారు.






