ఆ ఎంపీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నా: ఎమ్మెల్సీ కవిత ప్రకటన

by Gantepaka Srikanth |

ఎంపీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన ఎమ్మెల్సీ కవిత

ఆ ఎంపీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నా: ఎమ్మెల్సీ కవిత ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు(BC Reservation) కల్పించిన తర్వాతే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య(R. Krishnaiah) చేపట్టిన సత్యాగ్రహ దీక్షకు తెలంగాణ జాగృతి పక్షాన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం అని ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రటకన విడుదల చేశారు. ‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ప్రభుత్వ పెద్దల చర్యలను బట్టి స్పష్టమవుతున్నది. అసెంబ్లీ, కౌన్సిల్‌లో బిల్లులు పాస్ చేయడం మినహా 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం రాజ్యాంగబద్ధంగా, రాజకీయంగా ఉన్న ఏ ఒక అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకోలేదు. ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లలేదు.. అసలు ప్రధాని అపాయింట్మెంట్ కూడా కోరలేదు.. గవర్నర్‌ను కలిసి ఆర్డినెన్స్ జారీ చేయాలని విజ్ఞప్తి చేయలేదు. కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లులను కోల్డ్ స్టోరేజీలో పెడితే న్యాయపోరాటం చేయలేదు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే బీసీలు ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు’ అని ప్రకటనలో కవిత పేర్కొన్నారు.

Next Story