- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అసలు ఆ ప్రతిపాదన కేసీఆర్‌దే: సంచలన విషయం బయటపెట్టిన కవిత
నదుల అనుసంధానంపై ఎమ్మెల్సీ కవిత సంచలన విషయాలు చెప్పారు..

దిశ, వెబ్ డెస్క్: సాగు, తాగు నీటి అవసరాలకు నదుల అనుసంధానం మంచి ఫలితాలు ఇస్తుందనే భావన ప్రభుత్వాల్లో ఉన్నాయి. ఈ మేరకు కొన్ని ప్రభుత్వాలు ప్రయత్నం చేశాయి. మరికొన్ని ప్రభుత్వాలు ప్రాతిపాదనలు చేసి ఊరుకున్నాయి. అయితే ఆ పని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu) 2014-19 హయాంలో చేశారు. గోదావరి(Godavari), కృష్ణా నది(Krishna River)ని అనుసంధానం చేసి పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు(Pattiseema Lift Irrigation Project) నిర్మించారు. ఎలాంటి బడ్జెట్ పెంపుదల లేకుండానే సకాలంలో పూర్తి చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్స్‌లోకి కూడా ఎక్కారు. ప్రస్తుతం ఇదే విధానంలో గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు(Banakacharla)ను నిర్మించేందుకు కృషి చేస్తున్నారు. ఇక సీఎం చంద్రబాబు బాటలోనే గతంలో పలువురు సీఎంలు అడుగులు వేశారు. ఆయా రాష్ట్రాల్లో నదులను అనుసంధానం చేసి మంచి ఫలితాలు రాబట్టారు. అటు ప్రధాని మోడీ ఈ ప్రయత్నం చేశారు. మధ్యప్రదేశ్(Madyapradesh)లోని ఖజురహాలో జాతీయ నదుల(National rivers)ను అనుసంధానం చేశారు. కెన్-బెట్వా నదుల(Ken-Betwa Rivers) అనుసంధానంతో మధ్యప్రదేశ్‌తో పాటు ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు నీళ్లిచ్చే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు.
అయితే ఈ నదుల అనుసంధానం(Interlinking)పై ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. అసలు మొట్టమొదటి సారిగా ఈ ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది మాజీ సీఎం కేసీఆర్(Former Cm Kcr) అని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) స్పష్టం చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని ప్రారంభించిన ఆమె నదుల అనుసంధానంపై ఆసక్తికర వ్యా్ఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో నదుల అనుసంధానం విషయాన్ని ప్రధాని మోడీ(Pm Modi)కి వివరించారని తెలిపారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు నదుల అనుసంధానాన్ని తుపాకులగూడెం నుంచి చేపట్టాలని ప్రతిపాదించారని పేర్కొన్నారు. కానీ ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకుండా ఇచ్ఛంపల్లి నుంచి చేపడతామని చెప్పిందని కవిత తెలిపారు. అయితే ప్రస్తుతం పోలవరం నుంచి 200 టీఎంసీల గోదావరి నీళ్లను తరలించే ప్రయత్నం జరుగుతోందన్నారు. తెలంగాణకు శాశ్వతంగా గోదావరి నీళ్లు దూరం కానున్నాయని కవిత పేర్కొన్నారు. దీంతో నదుల అను సంధానం ప్రతిపాదనలో కేసీఆర్ పాత్రపై ఆయన తనయ కవిత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.






