MLC Kavitha: లిక్కర్ కేసులో కీలక పరిణామం.. ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం

by Shiva |
MLC Kavitha: లిక్కర్ కేసులో కీలక పరిణామం.. ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇంతకు ముందు సీబీఐ ఫైల్ చేసిన కేసులో డిఫాల్ట్ బెయిల్ కోరిన కవిత ఆ పిటిషన్‌ను అనూహ్యంగా వెనక్కి తీసుకుంది. కాగా, కేసులో పదే పదే బెయిల్ కోసం వాయిదాలు కోరడం పట్ల జడ్జి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీంతో కవిత తరఫు న్యాయవాదులు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకున్నారు. కాగా, నిన్నటి విచారణకు సీనియర్ న్యాయవాది హాజరుకాకపోవడంతో విచారణను వాయిదా వేయాలని కవిత తరఫు న్యాయవాది కోరారు. నిజానికి బుధవారం కవిత బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగాల్సి ఉండగా.. కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకోవడం ఆసక్తికరంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed