- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇది తెలంగాణ జాగృతి విజయం.. బనకచర్ల విషయంలో కేంద్రం నిర్ణయంపై స్పందించిన కవిత
పోలవరం - బనకచర్ల ప్రాజెక్టు(Banakacherla Project) విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: పోలవరం - బనకచర్ల ప్రాజెక్టు(Banakacherla Project) విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. ప్రాజెక్టుపై అనేక అభ్యంతరాలు వచ్చాయని, అనుమతులు ఇవ్వాలంటే గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రైబ్యునల్ (జీడబ్ల్యూడీటీ) తీర్పును పరిశీలించాల్సి ఉందని తెలిపింది. పర్యావరణ అనుమతులకు సీడబ్ల్యూసీని సంప్రదించడం అత్యవసరమని కమిటీ అభిప్రాయపడింది. తాజాగా కేంద్రం నిర్ణయంపై బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) స్పందించారు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి నిరాకరణ హర్షణీయం అన్నారు. ఈ నిర్ణయం తెలంగాణ జాగృతి, బీఆర్ఎస్ సాధించిన విజయం అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇకనైనా తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేయాలని కోరారు. బనకచర్లపై అపెక్స్ కౌన్సిల్ నిర్వహించాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాలని సూచించారు.






