- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MLC Kavitha : కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం
బీసీ బిల్లు కేంద్ర ప్రభుత్వం దగ్గరనే పెండింగ్‌లో ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: బీసీ బిల్లు కేంద్ర ప్రభుత్వం దగ్గరనే పెండింగ్‌లో ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. ఆ బిసీ బిల్లును పాస్ చేసి పంపుతారా? లేదా? అనేది సూటిగా చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇవాళ బంజారాహిల్స్‌లోని తన నివాసంలో కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, పటాన్ చెరు నియోజకవర్గాలకు చెందిన విద్యార్థులు, యువకులు ఎమ్మెల్సీ కవిత సమక్షంలో తెలంగాణ జాగృతిలో చేరారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి ఇద్దరు దార్శనికులు ఒకరు పీవీ నర్సింహా రావు అని, రెండోవారు తెలంగాణ సాధకులు కేసీఆర్ అని కొనియాడారు. కేసీఆర్, జయశంకర్ సార్ ఆలోచనలతో పుట్టిన సంస్థ తెలంగాణ జాగృతి అని వెల్లడించారు. తెలంగాణ జాగృతి 2006 లో మొదలయిందని, తెలంగాణ కల్చర్, గుర్తింపు నిలబెట్టాలి అనే ఒకే ఒక ఎజెండా తెలంగాణ జాగృతిది అని పేర్కొన్నారు.
(CM Revanth Reddy)సీఎం రేవంత్ రెడ్డికి బూతులు తప్ప ఒక్కసారి కూడా జై తెలంగాణ అనలేదని, యూత్ పాలిటిక్స్‌కి రావాలని డిమాండ్ చేశారు. స్టూడెంట్స్‌కి ఏ ప్రాబ్లెమ్ ఉన్నా తెలంగాణ జాగృతి ఫైట్ చేస్తదన్నారు. ఆడపిల్లకి స్కూటీల కోసం అందరం కలిసి ఫైట్ చెయాలని కోరారు. స్టూడెంట్ సమస్యలు మాట్లాడుతుంటే కాంగ్రెస్ నాయకులకి భయం అవుతుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ బ్రతికి బట్టకట్టిందే ఆడవాళ్ళ వల్ల అన్నది గుర్తు పెట్టుకోవాలని, ఇందిరా గాంధీ, సోనియా గాంధీ వల్లనే కాంగ్రెస్ పార్టీ బ్రతికిందని వివరించారు. మహిళలను తక్కువ చేసి మాట్లాడుతున్న జగ్గారెడ్డిని ఆయన భార్య, కూతురే సరిదిద్దాలని అన్నారు. జగ్గారెడ్డి వ్యాఖ్యలే కాంగ్రెస్ పార్టీ స్టాండా అన్నది సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. (Congress leader Jagga Reddy) జగ్గారెడ్డి పై కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే బీజేపీ పార్టీ ఎంపీ.. వకీల్ సాబ్ వంకర టింకరగా మాట్లాడుతున్నారని విమర్శలు చేశారు.






