కేసీఆర్ అభిమానులకు MLC కవిత కీలక పిలుపు

by Gantepaka Srikanth |

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా నిర్వహిస్తున్నారు.

కేసీఆర్ అభిమానులకు MLC కవిత కీలక పిలుపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మహాధర్నా కొనసాగనుంది. గోదావరి నీళ్లను ఒడిసి పట్టి.. నెర్రెలు బారిన తెలంగాణ నేలను సస్యశ్యామలం చేసిన కేసీఆర్‌‌కు కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్ర పూరితంగా నోటీసులు ఇవ్వడంపై కవిత మహాధర్నాకు పిలుపునిచ్చారు. తెలంగాణ జాగృతి తలపెట్టిన మహా ధర్నాకు రాష్ట్ర నలుమూలల నుంచి కేసీఆర్ అభిమానులు, జాగృతి శ్రేణులు తరలిరావాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రాణహిత-చేవెళ్లను కాళేశ్వరం ప్రాజెక్టుగా ఎందుకు రీడిజైన్‌ చేయాల్సి వచ్చింది..? కాళేశ్వరం అందుబాటులోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి కలిగిన ప్రయోజనాలను ఆమె వివరించనున్నారు. అలాగే.. కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్‌ ప్రభుత్వం పడావు పెట్టడంతో ఏటా యాసంగి సీజన్‌‌లో రైతాంగానికి జరుగుతున్న నష్టం.. కాళేశ్వరం కమిషన్‌ పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం సాగిస్తున్న రాజకీయాలపై మాట్లాడనున్నారు.

Next Story