కుల గణనపై స్పందించిన కవిత.. కాంగ్రెస్‌ సర్కార్‌కు మరో డిమాండ్

by Disha Web Desk 2 |
కుల గణనపై స్పందించిన కవిత.. కాంగ్రెస్‌ సర్కార్‌కు మరో డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వ కుల గణన నిర్ణయంపై బీఆర్ఎస్ మహిళా నేత, ఎమ్మెల్సీ కవిత స్పందించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బీసీల పట్ల కాంగ్రెస్‌కు ఏనాడూ చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కుల గణన తీర్మానం కేవలం కంటితుడుపు చర్య అని అన్నారు. కుల గణన ఎప్పటివరకు పూర్తి చేస్తారో ప్రభుత్వం చెప్పలేదని గుర్తుచేశారు. స్పష్టత లేని కుల గణనతో తీర్మానంతో బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీది బీసీ వ్యతిరేక పార్టీ అని విమర్శించారు.

చిత్తశుద్ధి ఉంటే కుల గణనకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. తక్షణమే అసెంబ్లీలో చట్టాన్ని ఆమెదించాలని అన్నారు. అంతేకాదు.. బీసీ సబ్‌ప్లాన్‌కు కూడా చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేశారు. కులగణన తర్వాత చట్టం ఎలాంటి పథకాలు అమలు చేయనుందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం కుల గణన కోసం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. సభలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ సభలో తీర్మానం ప్రవేశపెట్టగా.. ఆ తర్వాత సభ్యులందరూ చర్చించారు.

Next Story