- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
త్వరలోనే ఎన్నికల సైరన్ మోగబోతోంది.. MLC కవిత హాట్ కామెంట్స్
సింగరేణి(Singareni)లో తొందర్లోనే ఎన్నికల సైరన్ మోగబోతోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: సింగరేణి(Singareni)లో తొందర్లోనే ఎన్నికల సైరన్ మోగబోతోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) అన్నారు. సోమవారం ఆమె పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సింగరేణి ఎన్నిక(Singareni Election)ల్లో టీబీజీకేఎస్(TBGKS) ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటు తరువాతనే పెద్దపల్లి జిల్లాగా ఏర్పడింది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాతనే రామగుండానికి సింగరేణి మెడికల్ కాలేజీ వచ్చింది. కాంగ్రెస్‌కు 8, బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నా బడ్జెట్‌లో తెలంగాణకు కేంద్రం గుండుసున్నానే ఇచ్చిందని విమర్శించారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని అన్నారు.
బీఆర్ఎస్(BRS) హయంలో సింగరేణిలో 13 వేల మందికి డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు. సింగరేణిలో డిపెండెంట్ అలియాస్ సమస్య పరిష్కరించడంలో కాంగ్రెస్ విఫలమైందని విమర్శించారు. అలియాస్ సమస్యపై ప్రతి పక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన రేవంత్ రెడ్డికి ఇప్పుడు అలియాస్ సమస్య కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కాగితాలను మార్చుతుంటే.. బీఆర్ఎస్ హయాంలో తాము కార్మికుల జీవితాలు మార్చామని అన్నారు. సింగరేణి నిధులు డీఎంఎఫ్టీ పేరుతో కొడంగల్‌కు తరలించుకుపోతున్నారని ఆరోపించారు.
సింగరేణిలో 13 శాతం ఉన్న బోనస్‌ను బీఆర్ఎస్ 32 శాతానికి పెంచిందని వెల్లడించారు. రాత్రికల్లా రైతు భరోసా డబ్బులు వేస్తామని చెప్పిన రేవంత్ ఏ గ్రామంలో ఒక్క మూలకు కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. సింగరేణి కార్మికులను, విద్యార్థులను, మహిళలను, రైతులను అందరినీ కాంగ్రెస్ మోసం చేస్తోందని అన్నారు. మళ్ళీ మళ్ళీ సర్వేలు అంటూ జనాన్ని ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. తెలంగాణకు నెత్తి మీద నీటి కుండ లాంటిది పెద్దపల్లి జిల్లా అని వెల్లడించారు. బీసీ జనాభాపై కాంగ్రెస్ తప్పుడు లెక్కలు చెబుతోంది. అసలు కాంగ్రెస్‌కు బీసీల పట్ల చిత్తశుద్ధి లేదని అన్నారు.






