- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వారికి శుభాకాంక్షలు చెప్పిన MLC కవిత
సింగరేణి ప్రైవేటీకరణకు, బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా టీబీజీకేఎస్ పోరాడుతుందని.. ఎట్టి పరిస్థితుల్లోనూ సింగరేణిని కాపాడుకుంటామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: సింగరేణి ప్రైవేటీకరణకు, బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా టీబీజీకేఎస్ పోరాడుతుందని.. ఎట్టి పరిస్థితుల్లోనూ సింగరేణిని కాపాడుకుంటామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. టీబీజీకేఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ‘ఎక్స్’ వేదికగా ఆమె బొగ్గు గని కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి వెలుగులు పంచడమే లక్ష్యంగా కార్మికులు అహర్నిశలు పనిచేస్తున్నారని తెలిపారు. 23 సంవత్సరాలుగా కార్మికుల పక్షాన నిబద్ధతతో, చిత్తశుద్ధితో పోరాడుతున్న ఏకైక కార్మిక సంఘం టీబీజీకేఎస్ అని తెలిపారు. కేసీఆర్ మార్గ నిర్దేశకత్వంలో తెలంగాణ ఉద్యమంతో సహా అనేక ప్రజా పోరాటాలు చేపట్టిందని పేర్కొన్నారు. తెలంగాణలోని గోదావరి లోయలో ఉన్న బొగ్గు గనులన్నింటినీ సింగరేణి సంస్థకు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ మేరకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.






