కాంగ్రెస్ ప్రభుత్వం వేల కోట్లు అప్పు తెచ్చి.. ఒక్క పనికొచ్చే పని చేయడం లేదు: ఎమ్మెల్సీ కవిత

by Malleboina Mahesh |

కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. ఈ మేరకు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వేల కోట్లు అప్పు తెచ్చి.. ఒక్క పనికొచ్చే పని చేయడం లేదు: ఎమ్మెల్సీ కవిత
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అనుసరిస్తున్న తీరు పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఫైర్ అయ్యారు. ఈ మేరకు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 16 నెలల్లో వేల కోట్లు అప్పు తెచ్చి.. ప్రజలకు ఉపయోగపడే పనులు కూడా చేయలేదని మండిపడ్డారు. అలాగే కొద్ది రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అప్పులపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. తెలంగాణ పరువు తీస్తున్నారని అన్నారు. అలాగే ఏప్రిల్ 11న ఇష్యూ అయిన విడుదల జీవో 12న ఎందుకు వెబ్ సైట్ లో పెట్టలేదని ప్రశ్నించారు. ఈ జీవో ద్వారా తెలంగాణ స్టేట్ ఇండస్ట్రీయల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పోరేషన్ అనే ప్రైవేట్ లిమిటేడ్ కంపెనీని, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చారని అన్నారు.

దీని ద్వారా తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) వేల కోట్ల అప్పులను తీసుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. మొత్తం తెలంగాణలో ఉన్న ఇండస్ట్రీయల్ గుర్తింపు కలిగిన లక్షా 75 వేల భూములను స్టాక్ ఎక్సేంజ్‌లో కుదవపెట్టే అవకాశం ఉందని అన్నారు. దీనికోసమే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చారని ఫైర్ అయ్యారు. స్టాక్ ఎక్స్చేంజ్ అనేది నిలకడలేని వ్యవస్థ అని, అందులో ఒకసారి నష్టం వస్తే తెలంగాణ భవిష్యత్ కోసం జమ చేసుకున్న లక్షా 75 వేల ఎకరాలు ఆగం అవుతాయని గుర్తు చేశారు.

తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) లక్ష 80 వేల కోట్లు అప్పలు చేసింది. అయినా ఒక్క ప్రాజెక్టు కట్టలేదని, పూర్తిగా రైతు భరోసా ఇవ్వలేదని, మహిళలకు తులం బంగారం ఇవ్వలేదని, పెన్షన్లు పెంచలేదని ఆరోపించారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం 16 నెలల్లో లక్ష 80 వేల కోట్లు అప్పు తెచ్చి కేవలం 80 వేల కోట్లు మాత్రమే వడ్డీ కట్టారని, మిగిలిన లక్ష కోట్లు కాంట్రాక్టర్లకు పేమెంట్ చేశారని, ఇందులో 20 వేల కోట్లు సీఎం రేవంత్ రెడ్డి సొంత ఖాతాకు వెళ్లిందని ఆరోపించారు. ఒక వేల తన ఆరోపణలు తప్పని నిరూపించాలనుకుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం (White Paper) విడుదల చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత (MLC poem) డిమాండ్ చేశారు.

Next Story