ఇవాళ ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..ఎల్లో అలర్ట్ జారీ

by velandi.Saikiran |

ఇవాళ తెలంగాణ‌లోని ప‌లు జిల్లాల్లో భారీ వర్షాలు ప‌డ‌నున్నాయి.

ఇవాళ ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..ఎల్లో అలర్ట్ జారీ
X

దిశ‌, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. నాగర్ కర్నూల్, వరంగల్, హనుమకొండ, నల్గొండ, సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. అంతేకాదు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. మిగతా జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా మీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

ముఖ్యంగా హైదరాబాద్ మహా నగరంలో సాయంత్రం వరకు భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు అంచనా వేసింది. హైదరాబాద్ లో ఒకవేళ భారీ వర్షం కురిస్తే, అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని పేర్కొంది. ఇక అటు ఏపీలో కూడా వర్షాలు ఉన్నట్లు అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, పోలవరం, గుంటూరు, పల్నాడు, మార్కాపురం, నంద్యాల, కర్నూలు జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది.

Next Story