- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ లోపు ది ప్యారడైజ్ టాకీ పార్ట్ కంప్లీట్
ఆగస్టు 21న విడుదల కానున్న ‘ది ప్యారడైజ్’ మూవీ టాకీ పార్ట్‌ను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని మేకర్స్ టార్గెట్ పెట్టుకున్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: నేచురల్ స్టార్ నాని హీరోగా, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ సినిమాలో మమత బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీని ఆగస్టు 21న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్రబృందం షూటింగ్ పనులను వేగవంతం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ఈ నెలాఖరు నాటికి ఎలాగైనా సినిమా టాకీ పార్ట్‌ను పూర్తి చేయాలని మేకర్స్ టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
టాకీ పార్ట్ పూర్తయిన వెంటనే మిగిలిన పాటల చిత్రీకరణతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తి చేసి, ప్రకటించిన తేదీకే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్లాన్‌లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో ‘ది ప్యారడైజ్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రల్లో నటిస్తుండగా, అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (SLV Cinemas) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






