భూముల ధరలు హైక్.. ఉమ్మడి జిల్లా రియల్ ఎస్టేట్ పై ప్రభావం

by Kodari Anjali |

రాష్ట్రంలో పెరిగిన భూముల ధరల ప్రభావం ఉమ్మడి జిల్లాపై పడింది.

భూముల ధరలు హైక్.. ఉమ్మడి జిల్లా రియల్ ఎస్టేట్ పై ప్రభావం
X

రాష్ట్రంలో పెరిగిన భూముల ధరల ఎఫెక్ట్​ఉమ్మడి వరంగల్​జిల్లాపై పడింది. కొన్నిచోట్ల వ్యవసాయ, వ్యవసాయేతర భూముల ధరలు 50శాతం నుంచి 100శాతం పెరగడంతో రియల్​ఎస్టేట్​రంగంపై ప్రభావం పడనుంది. ఉమ్మడి వరంగల్​జిల్లా వ్యాప్తంగా రియల్​రంగం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటుంది. మామునూరు విమానాశ్రయం, ఇన్నర్ రింగ్ రోడ్డు, రింగ్ రోడ్డు సమీపంలో రియల్​వెంచర్లు వెలిశాయి. అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో కూడా 40 శాతం నుంచి 70 శాతం వరకు పెంపు జరిగింది. నగరం పరిధిలో ఏవైపునా చూసినా ప్రస్తుతం అత్యల్పం గజానికి రూ.1100 ఉండగా అత్యధికం రూ.46వేలుగా నిర్ణయించారు. వడ్డెపల్లి, కోటిపల్లి, కొత్తపల్లి ప్రాంతాల్లో భారీగా మార్కెట్ ధరలు పెరిగాయి. గతంలో ఎకరం రూ.2కోట్ల ఉండగా రూ.4 కోట్లుగా నిర్ణయించారు. పెరిగిన ధరలు అమలులోకి రావడంతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు అదనంగా రూ.150 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

దిశ, వరంగల్ బ్యూరో: రాష్ట్రంలో పెరిగిన భూముల ధరల ప్రభావం ఉమ్మడి జిల్లాపై పడింది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములపై 50 నుంచి 100 శాతం పెంచడంతో ఆ ప్రభావం రియల్ ఎస్టేట్ పై ఎక్కువగా పడింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లా పరిధిలో ఆటుపోట్లు ఎదుర్కొంటున్న రియల్ ఎస్టేట్ రంగం పెరిగిన ధరలతో మరింత దెబ్బతిననుంది. మార్కెట్ ధరలనుబట్టి వరంగల్ నగరంతో పాటు ఉమ్మడి జిల్లా పరిధిలో భారీగా ధరలను పెంచారు. భూముల మార్కెట్ విలువ పెంచడంతో ఆ భారం కొనుగోలుదారులపై పడనుంది. పెరిగిన ధరలు అమల్లోకి రాగా కొత్త మార్కెట్ విలువకు అనుగుణంగానే వ్యవసాయ, వ్యవసాయేతర భూములను రిజిస్ట్రేషన్ చేస్తున్నారు.

పెరిగిన భూముల ధరలు..

రాష్ట్ర ప్రభుత్వం భూముల మార్కెట్ వాల్యూను పెంచింది. ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా మార్కెట్ వాల్యూ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ ధరలను ఎక్కువగా పెంచారు. భూముల అమ్మకాలు, కొనుగోళ్లను బట్టి 50 శాతం నుంచి 100 శాతానికి పెంచారు. వరంగల్ నగర కార్పొరేషన్ పరిధిలో ఈ పెంపు భారీగా ఉంది. వరంగల్ నగరం రోజురోజుకూ విస్తరించడంతో భూముల ధరలు భారీగా పెరిగాయి. అపార్ట్ మెంట్లు, ప్లాట్లపై ఎక్కువగా పెంచారు. ఎల్కతుర్తి, హసన్​పర్తి, కాజీపేట, హన్మకొండ, దామెర, వరంగల్, గీసుకొండ, సంగెం, ఖిల్లా వరంగల్ మండలాల పరిధిలో ఈ పెంపు ఎక్కువగా ఉంది. నగరంలో అత్యధికంగా హన్మకొండ చౌరస్తా, వరంగల్, జేపీఎన్ రోడ్ లో అత్యధికంగా పెంచారు. ఈ ప్రాంతంలో గజం ధర రూ.46వేలుగా నిర్ణయించారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు ప్రాంతాల్లో కూడా భారీగా పెంచారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న ధరలకంటే 50 శాతం నుంచి 100 శాతం మేరకు పెంచారు. ప్రస్తుతం అత్యల్పం గజానికి రూ.1100 ఉండగా అత్యధికం రూ.46వేలుగా నిర్ణయించారు.

పాత రిజిస్ట్రేషన్ వాల్యూను బట్టి..

వడ్డెపల్లి, కోటిపల్లి, కొత్తపల్లి ప్రాంతాల్లో భారీగా మార్కెట్ ధరలు పెరిగాయి. గతంలో ఎకరం రూ.2కోట్ల ఉండగా రూ.4 కోట్లుగా నిర్ణయించారు. రింగ్ రోడ్డు వెంట భారీగా ధరలు పెరిగాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు, రింగ్ రోడ్డు బయట ఈ ధరలను పెంచారు. అర్బన్, గ్రామీణ ప్రాంతంలో కూడా 40 శాతం నుంచి 70 శాతం వరకు ఈ పెంపు జరిగింది. కనిష్ఠం వ్యవసాయ భూమికి ఎకరాకు రూ.2లక్షల 70వేలకు పెంపు చేశారు. నగరం పరిధిలో ఏవైపునా చూసినా పెంపు జరిగింది. వరంగల్, దేశాయిపేట్, లక్ష్మీపురం, కాశీబుగ్గ, శివనగర్, హన్మకొండ, పాలసముద్రం, పలివేల్పుల, ప్రశాంత్ నగర్, చైతన్య నగర్, గోపాలపురం, భీమారం ఏప్రాంతాలు చూసిన ఈ పెంపు జరిగింది. పాత రిజిస్ట్రేషన్ వాల్యూను బట్టి అక్కడ అమ్మకాలు, కొనుగోళ్లను పరిశీలించి బహిరంగ రేట్లను బట్టి ఈ ధరలను పెంచారు. పెరిగిన ధరలు శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చాయి. వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు సంబంధించి మార్కెట్ వాల్యూను బట్టే రిజిస్ట్రేషన్లు కొనసాగిస్తున్నారు. గతంలో స్లాట్లు బుక్ చేసిన వారికి అదనపు రుసుము చెల్లిస్తేనే బుకింగ్ చేస్తున్నారు.

రియల్​ఎస్టేట్​పై ప్రభావం..

రాష్ట్ర ప్రభుత్వం ఈదఫా భారీగా భూముల ధరలను పెంచింది. సరాసరి 50 శాతం నుంచి 100 శాతం వరకు, కొన్ని ప్రాంతాల్లో 200 శాతం వరకు కూడా పెంచడంతో ఆ ప్రభావం కొనుగోళ్లపై పడుతుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన సంవత్సరం కాలంగా రియల్ ఎస్టేట్ రంగం ఆటుపోట్లను ఎదుర్కొంటుంది. ప్రస్తుతం పెరిగిన మార్కెట్ ధరలు దానిపై తీవ్ర ప్రభావాన్ని చూపనున్నాయి. గ్రేటర్ వరంగల్ పరిధిలో భారీగా వెంచర్లు వెలుస్తున్నాయి. నగర శివారులో ఎక్కువగా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఓఆర్ఆర్ వెంట ఎక్కువగా వెంచర్లు వెలువడటంతో పాటు ప్లాట్ల అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి. నగరం పరిధిలో మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణానికి చర్యలు చేపట్టడం, కాకతీయ టెక్స్ టైల్స్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీతో పాటు పలు పరిశ్రమలు వస్తుండటంతో ఎక్కువ మొత్తంలో భూములపైన పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నారు.

ఉమ్మడి జిల్లా పరిధిలో..

ఒకేసారి భారీగా మార్కెట్ ధరలు పెరగడంతో ఆ ప్రభావం కొనుగోలు దారులపై పడనుంది. పెరిగిన ధరలకు అనుగుణంగా స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ తో పాటు ఇతర పన్నులు కూడా బాగా పెరిగాయి. నిన్నటి వరకు స్లాట్స్ చేసిన వారికి రిజిస్ట్రేషన చార్జీలపై అదనంగా 50 నుంచి 80 శాతం రిజిస్ట్రేషన్ ఫీజు ఎక్కువగా పడనుంది. ధరలు ఒకేసారి పెంచడం నగరం చుట్టూ అన్ని ప్రాంతాల్లో పెరగడం వల్ల ప్రభావం ఎక్కువగా ఉంటుందని రియల్ ఎస్టేట్ వర్గాలు భావిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో పెరిగిన మార్కెట్ ధరలతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా అదనంగా రూ.150 కోట్లకు పైగా పన్నుల రూపంలో వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పెరిగిన ధరలు అమల్లోకి రావడంతో ప్రస్తుతం తహశీల్దార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖల పరిధిలో రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు.

Next Story