చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. 'నార్వే చెస్' టైటిల్ సొంతం

by Malleboina Mahesh |

నార్వే చెస్ టైటిల్‌ను గెలుచుకుని సరికొత్త చరిత్ర సృష్టించిన భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద. ఈ ప్రతిష్టాత్మక టైటిల్ సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు.

చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. నార్వే చెస్ టైటిల్ సొంతం
X

దిశ, వెబ్ డెస్క్: భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద (R Pragnananda) చెస్ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఓస్లో వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక 'నార్వే చెస్' టోర్నమెంట్‌లో ఆయన విజేతగా నిలిచారు. శుక్రవారం జరిగిన టోర్నమెంట్ చివరి రౌండ్‌లో జర్మనీకి చెందిన విన్సెంట్ కేమర్‌పై ప్రజ్ఞానంద అద్భుత విజయం సాధించి, ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చెస్ క్రీడాకారుడిగా రికార్డు సృష్టించారు.

లెజెండ్స్ కు సాధ్యం కానిది సాధించి..

చివరి రోజు ఆట ప్రారంభానికి ముందు ప్రజ్ఞానంద 15 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నారు. అయితే అత్యంత కీలకమైన సమయంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ఆయన, క్లాసికల్ గేమ్‌లో విజయం సాధించి పూర్తి 3 పాయింట్లను తన ఖాతాలో వేసుకున్నారు. దీంతో మొత్తం 18 పాయింట్లతో టోర్నమెంట్‌లో అగ్రస్థానంలో నిలిచి ప్రతిష్టాత్మక ట్రోఫీని కైవసం చేసుకున్నారు. 2013లో ఈ టోర్నమెంట్ ప్రారంభమైనప్పటి నుండి, భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్, ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ డి గుకేష్ వంటి టాప్ ప్లేయర్లకు కూడా సాధ్యం కాని ఈ అరుదైన మైలురాయిని ఈ 20 ఏళ్ల చెన్నై ఆటగాడు ఆర్ ప్రజ్ఞానంద అందుకోవడం విశేషంగా నిలిచింది. దీంతో ఆయన ప్రతిభపై భారతీయులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story