- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుమల: ఆపన్న హృదయ దాతలకు టీటీడీ శుభవార్త.. శ్రీవారి దర్శన సమయంలో కీలక మార్పు
తిరుమల శ్రీవారిని దర్శించుకునే ఆపన్న హృదయ స్కీమ్ ట్రస్టు దాతలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త తెలిపింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తిరుమల శ్రీవారిని దర్శించుకునే ఆపన్న హృదయ స్కీమ్ ట్రస్టు దాతలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త తెలిపింది. దాతల సౌకర్యార్థం వారికి కల్పించే వీఐపీ బ్రేక్ దర్శన వేళల్లో కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు సాయంత్రం వేళలో ఉన్న దర్శన సమయాన్ని ఉదయానికి మారుస్తూ టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది.
దర్శన సమయం మార్పు
గతంలో ఆపన్న హృదయ స్కీమ్ దాతలకు సాయంత్రం 4 గంటలకు దర్శన సమయం కేటాయించారు. అయితే, దర్శన సమయాన్ని ఉదయానికి మార్చాలని దాతల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు రావడంతో టీటీడీ సానుకూలంగా స్పందించి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ స్కీమ్ కింద రూ. లక్ష విరాళం అందించిన దాతతో పాటు, వారి కుటుంబానికి చెందిన మొత్తం ఐదుగురికి ఒకసారి వీఐపీ బ్రేక్ దర్శన అవకాశం లభిస్తుంది.
రోజువారీ కోటా..
ప్రతిరోజూ 40 టికెట్ల ద్వారా గరిష్టంగా 200 మంది దాతలు (వారి కుటుంబ సభ్యులతో కలిపి) ఈ స్కీమ్ కింద శ్రీవారిని దర్శించుకునేందుకు టీటీడీ అనుమతి ఇస్తుంది. ఆపన్న హృదయ ట్రస్టు ద్వారా సేకరించిన ఈ విరాళాలను తిరుపతిలోని ‘శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం’ (చిన్న పిల్లల ఆసుపత్రి) నిర్వహణ, చికిత్సల నిమిత్తం టీటీడీ వెచ్చించనుంది. దాతల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని, వారి విజ్ఞప్తికి విలువనిస్తూ టీటీడీ తీసుకున్న ఈ తాజా నిర్ణయం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






