త్రివిక్రమ్‌కు కొత్త టెన్షన్.. పెరుగుతున్న ప్రెజర్

by Pulgam srinivas |

వెంకటేష్ ఇప్పటికే అనిల్ రావిపూడి సినిమాకు కమిట్ కావడంతో, ‘ఆదర్శ కుటుంబం AK47’ షూటింగ్‌ను త్వరగా పూర్తి చేయాలంటూ త్రివిక్రమ్‌పై ప్రెజర్ పెరిగినట్లు టాక్ వినిపిస్తోంది.

త్రివిక్రమ్‌కు కొత్త టెన్షన్.. పెరుగుతున్న ప్రెజర్
X

దిశ, వెబ్ డెస్క్: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘గుంటూరు కారం’ చిత్రం తర్వాత కాస్త విరామం తీసుకుని ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ హీరోగా ‘ఆదర్శ కుటుంబం AK47’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ ప్రారంభమైన తర్వాత ఈ సినిమాను జెట్ స్పీడ్‌లో పూర్తి చేసి సమ్మర్ కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే అనుకున్న ప్రణాళిక ప్రకారం సినిమా సమ్మర్‌లో విడుదల కాలేకపోయింది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

అయితే ఇదే సమయంలో త్రివిక్రమ్‌పై ఓ విషయంలో ఒత్తిడి పెరిగినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. వెంకటేష్ ఇప్పటికే దర్శకుడు అనిల్ రావిపూడితో మరో సినిమాకు కమిట్ అయ్యాడు. ఆ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తుండగా, ఈ నెల నుంచే షూటింగ్ కూడా ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వెంకటేష్ ఒకేసారి త్రివిక్రమ్, అనిల్ రావిపూడి సినిమాల షూటింగ్‌ల్లో పాల్గొనాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దీంతో ప్రస్తుతం వెంకటేష్, త్రివిక్రమ్ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ కారణంగా త్రివిక్రమ్ కూడా అనుకున్న దానికంటే వేగంగా షూటింగ్ పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, నివేదా పేతురాజ్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఎస్‌ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు.

Next Story