ఆదాయం కోల్పోతున్న వ్యవసాయ మార్కెట్..

by Kodari Anjali |

వ్యవసాయ మార్కెట్ ప్రతి నెల సుమారు 20 నుండి 30 వేల రూపాయల వరకు ఆదాయం కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది అని స్థానికులు చర్చించుకుంటున్నారు.

ఆదాయం కోల్పోతున్న వ్యవసాయ మార్కెట్..
X

దిశ, ఏన్కూర్: ప్రభుత్వానికి ఆదాయం తీసుకురావాల్సిన అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వల్ల వ్యవసాయ మార్కెట్ కి ప్రతి నెల సుమారు 20 నుండి 30 వేల రూపాయల వరకు ఆదాయం కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది అని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఏనుకూరు వ్యవసాయ మార్కెట్ అనుబంధంగా ఉన్న ప్రధాన రహదారి పక్కన షాపింగ్ కాంప్లెక్స్ వేలంపాట నిర్వహించడంలో జాప్యం జరగడంతో షాపులు కోసం ఎదురుచూస్తున్న అద్దె దారులు నిరుత్సాహానికి గురవుతున్నారు. సుమారు 20 నెలల నుండి షాపులు అద్దెలకు ఇవ్వకుండా ఖాళీగా ఉండటం వల్ల మార్కెట్ కు ఖాళీగా ఉన్న సమయంలో సుమారు మూడు లక్షల రూపాయల ఆదాయం కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొందని అంటున్నారు.

ఆదాయం వచ్చే దిశగా..

అధికారులు వేలంపాట వేసి షాపులను అద్దెదారులకు కేటాయించడం లో జాప్యం చేయడంలో ఆంతర్యం ఏమిటో స్థానికులకు అంతు పట్టని ప్రశ్న, ప్రధాన రోడ్డుకు పక్కన ఉన్న షాపులకు మంచి డిమాండ్ ఉండటంతో వేలంపాట వేస్తే మార్కెట్కు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత మార్కెటింగ్ శాఖ అధికారులు మార్కెట్కు ఆదాయం వచ్చే దిశగా ఖాళీగా ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ కు తక్షణమే వేలంపాట వేసే విధంగా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై మార్కెట్ కమిటీ చైర్మన్ లచ్చిరాం నాయక్ ను వివరణ కోరగా ఈనెల 15వ తేదీ లోపు షాపులకు వేలంపాట నిర్వహించేందుకు చర్యలు చేపడతామన్నారు.

Next Story