- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rambha: జేడీ చక్రవర్తి చేసిన పని నన్ను చాలా బాధించింది.. దాంతో చాలాసేపు తిట్టాను
తన పెళ్లికి రాకపోవడంతో చాలా బాధపడి జేడీ చక్రవర్తిని తిట్టానని రంభ వెల్లడించింది.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లలో ఒకరైన రంభ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోల సరసన నటించి తన అందం, నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈమె కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ సినిమాలు చేసి దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రంభ, నటుడు జేడీ చక్రవర్తి గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. తాను, జేడీ చక్రవర్తి కలిసి ‘బొంబాయి ప్రియుడు’ సినిమాలో నటించామని ఆ సమయంలో ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడిందని తెలిపింది.
అయితే అంత మంచి స్నేహితుడు అయినప్పటికీ తన పెళ్లికి ఆహ్వానించినా జేడీ చక్రవర్తి రాలేదని చెప్పింది. దీంతో తాను చాలా బాధపడి, తర్వాత బాగా తిట్టానని రంభ వెల్లడించింది. అయితే జేడీ చక్రవర్తి చాలా సరదాగా ఉంటారని, ఆయనతో ఉంటే టైమ్‌పాస్ అవుతుందని కూడా రంభ పేర్కొంది. కొంతకాలం క్రితం ఓ టీవీ షోలో రంభ, జేడీ చక్రవర్తి కలిసి సందడి చేయగా, అది అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఇదే ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం గురించి కూడా రంభ మాట్లాడింది. కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా గ్లామర్ పాత్రలు చేయడంతో, తర్వాత మంచి నటన కనబరిచినా అలాంటి పాత్రలే ఎక్కువగా వచ్చాయని ఆమె తెలిపింది.






