- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాలుగు రోజుల్లో మూడు రీ-రిలీజ్‌లు.. కొత్త సినిమాల పరిస్థితి ఏంటి?
కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే ‘సమరసింహారెడ్డి’, ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’, ‘ఈశ్వర్’ వంటి మూడు భారీ సినిమాలు రీ-రిలీజ్‌కు సిద్ధమవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

దిశ, వెబ్ డెస్క్: గత కొంతకాలంగా తెలుగు సినిమా పరిశ్రమలో రీ-రిలీజ్ ట్రెండ్ జోరుగా కొనసాగుతోంది. కేవలం తెలుగు సినిమాలే కాకుండా, తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందిన డబ్బింగ్ చిత్రాలను కూడా భారీ స్థాయిలో మళ్లీ విడుదల చేస్తున్నారు. ఈ ట్రెండ్ పెరుగుతుండటంతో చిన్న సినిమాల నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. రీ-రిలీజ్‌ల కారణంగా పెద్ద ఎత్తున థియేటర్లు బ్లాక్ అవుతున్నాయని, దీంతో చిన్న సినిమాలకు సరైన అవకాశాలు దక్కడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే మూడు భారీ సినిమాలు రీ-రిలీజ్‌కు సిద్ధమవడం చర్చనీయాంశంగా మారింది.
నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న ‘సమరసింహారెడ్డి’ సినిమాను రీ-రిలీజ్ చేయనున్నారు. అలాగే జూన్ 12న సూర్య నటించిన ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’, జూన్ 13న ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘ఈశ్వర్’ చిత్రాలను కూడా మళ్లీ విడుదల చేయనున్నారు. ఇలా వరుసగా భారీ చిత్రాలు రీ-రిలీజ్ అవుతున్న నేపథ్యంలో, అదే సమయంలో విడుదలయ్యే చిన్న సినిమాల పరిస్థితి ఏమవుతుందనే చర్చ ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది. థియేటర్ల లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.






