- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MLC Kavitha: నా పై తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు.. మండలి చైర్మన్‌కి ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తనపై చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) తనపై చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చితపండు నవీన్ నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా, కించపరిచేలా చేసిన వ్యాఖ్యలు ‘కమిటీ ఆన్ ఎథిక్స్’కు రెఫర్ చేయాలని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Council Chairman Gutha Sukhender Reddy)కి ఆదివారం లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. నాపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారని లేఖలో పేర్కొన్నారు. గౌరవ చట్టసభలో సభ్యుడిగా ఉన్న మల్లన్న ప్రజాప్రతినిధి నైన నాపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొన్నారు. దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని రెండేళ్లుగా నేను ఉద్యమిస్తున్నాని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు ఢిల్లీ వేదికగా బీసీ గొంతుకగా నిలిచానని పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని బలంగా గొంతు వినిపిస్తున్నాని తెలిపారు.
మా పోరాటాల ఫలితంగానే బీసీలకు 42% రిజర్వేషన్లు!
తెలంగాణ జాగృతి చేసిన ఉద్యమాలకు దిగివచ్చే రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ, శాసన మండలిలో (BC Reservations) బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రాజకీయ రిజర్వేషన్లు, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రెండు వేర్వేరు బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించిందని తెలిపారు. ఈ బిల్లు చట్టరూపం దాల్చడానికి ఆలస్యమవుతోందని ఢిల్లీ వేదికగా ఉద్యమం చేపట్టి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడికి ప్రయత్నించినట్లు వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ హైకామాండ్‌పైనా ఒత్తిడి తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ పోరాటాలు, ఉద్యమాల ఫలితంగానే రాష్ట్ర కేబినెట్ బీసీలకు చట్ట సభల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీర్మానం చేసి గవర్నర్ ఆమోదం కోసం పంపిందని తెలిపారు.
ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేయాలి
రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించామని అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకర్గంలో ఝరాసంగంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఈ సంబరాలపై స్పందిస్తూ నాపై అనుచిత వ్యాఖ్యలు చేశారని వివరించారు. చట్టసభలో సభ్యురాలినైనా నాపైనే మల్లన్న ఈ తరహా వ్యాఖ్యలు చేశారంటే.. సమాజంలోని సామాన్య మహిళల విషయంలో ఆయన ఎలాంటి భావనతో ఉంటారో అర్థం చేసుకోవచ్చన్నారు. తీన్మార్ మల్లన్న నాపై చేసిన అనుచిత వ్యాఖ్యలను శాసన మండలిలోని ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేయాలని రూల్ నెంబర్ 262-సీ సబ్ రూల్ -1 కింద కోరుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
కాగా, జహీరాబాద్ పర్యటనలో శనివారం తీన్మార్ మల్లన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది. అయితే, శనివారం జహీరాబాద్ వద్ద బీసీ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలు ఇవే.. బీసీలకు ఏమొస్తే నీకెందుకు.. నువ్వేమన్న బీసీవా.. కంచం పొత్తు ఉందా.. మంచం పొత్తు ఉందా అంటూ కల్వకుంట్ల కవితపై ఎమ్మెల్సీ మల్లన్న తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే తెలంగాణ జాగృతి కార్యకర్తలు మల్లన్న కార్యాలయంపై దాడికి ప్రయత్నించినట్లు సమాచారం.






