నిరాహార దీక్ష విరమించిన ఎమ్మెల్సీ కవిత.. లోకల్ బాడీ ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-08-04 12:36:33  IST  )

తెలంగాణ బీసీ రిజర్వేషన్ (Telangana BC Reservation) సాధన కోసం హైదరాబాద్ లోని ధర్నా చౌక్ (Dharna Chowk) వద్ద తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) 72 గంటల నిరాహార దీక్ష తలపెట్టిన విషయం తెలిసిందే.

నిరాహార దీక్ష విరమించిన ఎమ్మెల్సీ కవిత.. లోకల్ బాడీ ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీసీ రిజర్వేషన్ (Telangana BC Reservation) సాధన కోసం హైదరాబాద్ లోని ధర్నా చౌక్ (Dharna Chowk) వద్ద తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) 72 గంటల నిరాహార దీక్ష తలపెట్టిన విషయం తెలిసిందే. ధర్నాచౌక్ వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడటంతో దీక్షను విరమించాలని హైకోర్టు (High Court) ఆదేశాలు జారీ చేయడంతో కవిత దీక్ష విరమించారు. ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టు ఆదేశాలను గౌరవిస్తూ దీక్షను విరమిస్తున్నానని, లోకల్ బాడీ ఎన్నికలకు (Local Body Elections) బీసీ రిజర్వేషన్ జరగకుండా వెళ్తే.. ఎన్నికలను ఎలా ఆపాలో తమకు తెలుసన్నారు. బీసీ బిల్లు సాధన కోసం తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపిన ఆర్. కృష్ణయ్యకు కృతజ్ఞతలు తెలిపారు.

నిరాహార దీక్ష చేసేందుకు సాయంత్రం 5 గంటల వరకే పర్మిషన్ ఉండగా.. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో ధర్నా చౌక్ వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇదే సమయంలో భారీ వర్షం కురవడం, హైకోర్టు ఆదేశాలతో కవిత దీక్షను విరమించారు.

Next Story