- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త కార్మిక చట్టాలను ఉపసంహరించుకోండి.. కేంద్రానికి ఎమ్మెల్సీ కవిత డిమాండ్
కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఇవాళ కేంద్ర కార్మిక సంఘాలు, స్వత్రంత్ర సమాఖ్యలు, వివిధ సంఘాలు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఇవాళ కేంద్ర కార్మిక సంఘాలు, స్వత్రంత్ర సమాఖ్యలు, వివిధ సంఘాలు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సార్వత్రిక సమ్మేకు సంపూర్ణ మద్దతును తెలుపుతూ సోషల్ మీడియా (Social Media) ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని రద్దు చేయాలనే కుట్రలను తిప్పికొడుదామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా తెచ్చిన కొత్త లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని కోరుతూ.. కార్మిక సంఘాలు ఇవాళ పిలుపునిచ్చిన దేశవ్యాప్త సార్వత్రిక కార్మిక సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని అన్నారు. కార్మికుల హక్కులను కాలరాసే కొత్త కార్మిక చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.
కాగా, దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా కార్మికులు కేంద్ర ప్రభుత్వ ఎదుట కొన్న డిమాండ్లను పెట్టారు. ప్రధానంగా కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని పేర్కొన్నారు. అదేవిధంగా 17 డిమాండ్లను నెరవేర్చాలని, 10 గంటల పనిదినాలకు అనుమతినిచ్చిన, తెలంగాణ షాప్స్ (Telangana Shops), ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్-1988 (Establishment Act-1988) లోని సెక్షన్ 16, 17ను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 282ను రద్దు చేయాలని కోరుతున్నారు. కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన కార్మిక చట్టాలను కేంద్రం రద్దు చేయాలని, రూ.26 వేలను కనీస వేతనంగా నిర్ధారించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణను విరమించుకోవాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రయోజనాలతో పాటు జేఏసీ కార్మికుల హక్కులను కాపాడటమే తమ ప్రధాన డిమాండ్ అని కార్మికులు పేర్కొన్నారు.






