ఎయిర్ పోర్టుకు రాణి రుద్రమ దేవి పేరు పెట్టాలి.. లేదంటే పోరాటమే: ఎమ్మెల్సీ కవిత డిమాండ్

by Ramesh Naini |

ఎయిర్ పోర్ట్ కి రాణి రుద్రమదేవి పేరు పెట్టాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఎయిర్ పోర్టుకు రాణి రుద్రమ దేవి పేరు పెట్టాలి.. లేదంటే పోరాటమే: ఎమ్మెల్సీ కవిత డిమాండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Warangal Airport) వరంగల్‌లో రాబోతున్న ఎయిర్ పోర్ట్ కి రాణి రుద్రమదేవి (Rani Rudrama Devi) పేరు పెట్టాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం వరంగల్ పర్యటనలో ఉన్న ఎమ్మెల్సీ కవిత హన్మకొండలో మీడియాతో మాట్లాడారు. వరంగల్ (Mamnoor Airport) మామునూరు ఎయిర్ పోర్టుకు రాణి రుద్రమ దేవి పేరు పెట్టాల్సిందేనని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఓరుగల్లు ప్రజలు ఈ డిమాండ్ చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న బస్టాండ్ నిర్మించినా.. రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ వంటి గాంధీ పేర్లు పెట్టి మన తెలంగాణ సంస్కృతిని వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తారని విమర్శించారు. రాణి రుద్రమ దేవి పేరు పెట్టే వరకు ఊరుకోవద్దని అన్నారు. దీనిపై తెలంగాణ జాగృతి పోరాటం చేస్తాదని, ఈ విషయంపై సంబంధిత కేంద్ర మంత్రికి లేఖ రాయబోతున్నట్లు చెప్పుకొచ్చారు.

ఇక, వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట రైతులకిచ్చిన రూ. 2లక్షల రుణమాఫీ హామీని కాంగ్రెస్ సర్కార్ నీరుగార్చిందన్నారు. రైతు డిక్లరేషన్ ఫుల్ ఫిల్ కాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి రైతులు ఓటు వేశారని, అలాంటి రైతులను నిండా ముంచిన ప్రభుత్వం ఇప్పుడు నడుస్తోందని మండిపడ్డారు. కౌలు రైతులకు ఏడాదికి రూ. 15 వేలు ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైంది ? అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కౌలు రైతుల గురించి ఎందుకు మాట్లాడడం లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఇటీవల రైతు భరోసా ఇచ్చారని తెలిపారు. రైతు భరోసా కూడా ఇచ్చిన హామీ ప్రకారం ఇవ్వడం లేదని, రూ.15 వేలు అని చెప్పి.. రూ.12 వేలు ఇచ్చారని వివరించారు.

Next Story