- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈడ్చుకెళ్లిన ఘటన.. జగిత్యాల కలెక్టర్‌పై చర్యలు తీసుకోవాలి.. ఎమ్మెల్సీ కవిత డిమాండ్
జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. సోమవారం (Prajavani) ప్రజావాణి కార్యక్రమంలో ఓ దివ్యాంగుడిపై సిబ్బంది, పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. తన ఇంటికి సంబంధించిన సమస్య పరిష్కారం కోసం కలెక్టరేట్‌లో ప్రజావాణికి వచ్చిన మల్లాపూర్ మండలం ముత్యంపేటకు చెందిన దివ్యాంగుడు రాజ గంగారామ్‌ను సిబ్బంది, పోలీస్ కానిస్టేబుల్ కలిసి అతన్ని ఈడ్చుకెళ్లారు. ఈ క్రమంలోనే కలెక్టర్ సత్యప్రసాద్ ఇది చూసీ చూడనట్లు వెళ్లిపోయారు. రాజగంగారామ్ కొన్నేండ్లుగా ఇంటి సమస్య పరిష్కారం కోసం పోరాడుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) స్పందించారు. ఈ మేరకు సోమవారం ఎక్స్ వేదికగా జగిత్యాల జిల్లా (Jagityala Collector) కలెక్టర్‌పై ఫైర్ అయ్యారు.
ప్రజాపాలన అంటే ఇదేనా? అంటూ ఆమె ప్రశ్నించారు. ప్రజావాణిలో గోడు చెప్పుకునేందుకు వచ్చిన దివ్యాంగుడిని కలెక్టర్ ఎదుటే ఈడ్చి వీల్ చైర్ నుంచి కిందపడేసి లాక్కెళ్లడం అత్యంత దుర్మార్గం అని తెలిపారు. ఈ ఘటన కు బాధ్యుడైన కానిస్టేబుల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, తన కళ్లెదుటే ఇంతటి దారుణం జరుగుతున్నా స్పందించని జగిత్యాల కలెక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.






