దానిపై కేంద్రం ప్రకటన చేసి తీరాల్సిందే.. MLC కవిత డిమాండ్

by Gantepaka Srikanth |

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం(NDA Government)పై బీఆర్ఎస్(BRS) నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు(MLC Kavitha) చేశారు.

దానిపై కేంద్రం ప్రకటన చేసి తీరాల్సిందే.. MLC కవిత డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం(NDA Government)పై బీఆర్ఎస్(BRS) నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు(MLC Kavitha) చేశారు. ఈ మేరకు ఆదివారం సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. జనగణన ఇంకెప్పుడు చేస్తారని ప్రశ్నించారు. జనగణనను కేంద్రం కావాలనే విస్మరిస్తోందని మండిపడ్డారు. జనాభా లెక్కలు లేకుండా ప్రగతి ఎలా సాధ్యమవుతుందని అన్నారు. జనాభా లెక్కలు లేమితో వృద్ధికి ఆటంకం కలుగుతుందని చెప్పారు. జనాభా లెక్కలు లేకుండా దేశ సామాజిక, ఆర్థిక పరిస్థితి ఎలా తెలుస్తుందని అడిగారు. ప్రగతిశీల విధానాలకు జనాభా లెక్కలు తప్పనిసరి అని అభిప్రాయపడ్డారు. జనగణనపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

కాగా, బడ్జెట్‌(Union Budget-2025)లో జనాభా లెక్కల సేకరణ కసరత్తుకు ఈసారి కూడా నామమాత్రంగా రూ.574.80 కోట్లు కేటాయించారు. 2024-25 బడ్జెట్‌లో రూ.572 కోట్లు ప్రతిపాదించారు. ఈసారి కూడా స్వల్ప మొత్తంతో సరిపెట్టడాన్ని బట్టి.. జనగణన మరింత ఆలస్యం కానుందని స్పష్టమవుతోంది. నిజానికి 2020-21లోనే ఈ క్రతువు జరగాల్సింది. కొవిడ్‌-19 మహమ్మారి కారణంగా అది వాయిదాపడింది.

మరోవైపు బడ్జెట్‌పైనా ఎమ్మెల్సీ కవిత సీరియస్ అయ్యారు. తెలంగాణలో పసుపు బోర్డు(Pasupu Board) ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ ప్రభుత్వం.. బోర్డుకు పైసా కూడా కేటాయించకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పైసెస్, టీ, కాఫీ, రబ్బర్ బోర్డులకు నిధులు కేటాయించి, పసుపు బోర్డును గాలికొదిలేసిందని విమర్శించారు. నిజామాబాద్ పసుపు రైతులను మోసగించిందని, నిధులు లేని పసుపు బోర్డు ఎలా పనిచేస్తుందని ప్రశ్నించారు. బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తన అసమర్థతను మరోసారి నిరూపించుకుందని విమర్శించారు.

Next Story