- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kavitha: ఆ విషయంలో బండి సంజయ్ మాట్లాడకపోతే విచిత్రం.. కవిత కౌంటర్
బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత రియాక్ట్ అయ్యారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: బీసీల కోసం కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు చిత్తశుద్ధితో పని చేయడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విమర్శించారు. సామాజిక తెలంగాణ అంటే ఢిల్లీకి వెళ్లి ఉత్తుత్తి ధర్నాలు చేయడం కాదని ధ్వజమెత్తారు. జై తెలంగాణ అనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. బీసీల కోసం జాగృతి కార్యాచరణ సిద్ధం చేస్తున్నదని చెప్పారు. రాబోయే రోజుల్లో అనేక పోరాటాలు నిర్వహించబోతున్నామన్నారు. తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) ఆవిర్భావ వేడుకలు ఇవాళ జూబ్లీహిల్స్ లోని జాగృతి కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కవిత.. తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ, వనరులు, ఈ ప్రాంత సాంస్కృతిక వైరుధ్య పరిరక్షణ కోసం ఏర్పాటైనదే తెలంగాణ జాగృతి అన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ చెప్పినట్లుగా, వారి బాటలో తెలంగాణ జాగృతి ముందుకు వెళ్ళిందని జయ శంకర్ సార్ ఆలోచనలను తూ.చా తప్పకుండా పాటించామన్నారు.
ముస్లిం రిజర్వేషన్లపై (BC reservations) బండి సంజయ్ మాట్లాడకపోతే విచిత్రం అని బీసీలకు ఇచ్చే 42 శాతం రిజర్వేషన్ లో ముస్లింలు ఉండొద్దని ముందు నుంచి బండి సంజయ్ మాట్లాడుతునే ఉన్నారని విమర్శించారు. బీజేపీ బీసీలను మోసం చేస్తోందని దుయ్యబట్టారు. బీసీ రిజర్వేషన్ లపై కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకు వెళ్ళాలి. ఈ విషయంలో కాంగ్రెస్ అన్ని పార్టీల నాయకులకు లేఖలు రాయాలన్నారు. రాష్ట్రపతి అపాయింట్ మెంట్ తీసుకొని, అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకొని వెళ్ళాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. బీసీల కోసం మేము 72 గంటల పాటు దీక్షకు పూనుకున్నాము. కోర్టు నుంచి మాకు పర్మిషన్ రాలేదన్నారు. ఆగస్టు 15 లోపే పెద్ద ఎత్తున జాగృతి నూతన కమిటీలు ఏర్పాటు ఉంటుందన్నారు. జాగృతిలోకి వచ్చేందుకు చాల మంది రెడీగా ఉన్నారు, మాకు అన్ని వర్గాల సపోర్ట్ వస్తుందని చెప్పారు.






