- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఓ మహిళగా బాధపడుతున్నా’’.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కామెంట్స్‌కి ఎమ్మెల్సీ కవిత కౌంటర్
ఋతుస్రావం అనేది వైకల్యం కాదని, అది స్త్రీ జీవిత ప్రయాణంలో ఓ భాగమని, అందుకు ప్రత్యేకంగా సెలవు ఇవ్వడం అవసరం లేదని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్న విషయం తెలిసిందే.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఋతుస్రావం అనేది వైకల్యం కాదని, అది స్త్రీ జీవిత ప్రయాణంలో ఓ భాగమని, అందుకు ప్రత్యేకంగా సెలవు ఇవ్వడం అవసరం లేదని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్న విషయం తెలిసిందే. దీంతో ఆమె వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో స్మృతి ఇరానీ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ ఎక్స్ వేదికగా స్పందించారు. మహిళల బాధ పట్ల ఇలాంటి నిర్లక్ష్యాన్ని చూడాల్సి వస్తున్నందుకు ఓ మహిళగా బాధపడుతున్నానని పేర్కొన్నారు. నెలసరి సమయంలో మహిళలు పడే బాధను గమనించి సెలవు ఇవ్వాల్సింది పోయి.. మంత్రి ఆ విషయాన్ని కొట్టిపారేయడం విచారం కలిగించిందన్నారు. నెలసరి తమకున్న ఎంపిక కాదని, అదొక సహజమైన జీవ ప్రక్రియ అని తెలిపారు. వేతనంతో కూడిన సెలవును తిరస్కరించడం మహిళల బాధను విస్మరించినట్లేనని విమర్శించారు.
Next Story






