- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MLC Kavitha: ఆయన గిరిజన హక్కుల కోసం బలమైన గొంతుకగా నిలిచారు
by Gantepaka Srikanth |
ఆయన గిరిజన హక్కుల కోసం బలమైన గొంతుకగా నిలిచారు

X
దిశ, వెబ్‌డెస్క్: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జేఎన్ఎం వ్యవస్థాపకుడు శిబూసోరెన్ మరణం బాధాకరమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఆయన గిరిజన హక్కుల కోసం బలమైన గొంతుకగా నిలిచారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి కూడా తన మద్దతును అందించారని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు, మద్దతుదారులకు హృదయపూర్వక సంతాపం ప్రకటించారు. అంతకుముందు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన మలిదశ ఉద్యమానికి శిబూసోరెన్ అందించిన అపూర్వ సహకారాన్ని ఎప్పటికీ మరిచిపోలేమని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబూసోరెన్ మృతిపై తీవ్ర సంతాపం ప్రకటించారు. శిబూసోరెన్ కుమారుడు, జార్ఖండ్ ప్రస్తుత ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు.
Next Story






