- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Media Accreditations: జర్నలిస్టుల అక్రిడిటేషన్ పొడిగింపుపై ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర వ్యాఖ్యలు
జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువును మరో మూడు నెలలు పొడిగిస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: జర్నలిస్టుల (journalists) అక్రిడిటేషన్ కార్డుల (Accreditation cards) గడువును మరో మూడు నెలలు పొడిగిస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) స్పందించారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో మీడియాతో చిట్‌చాట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జర్నలిస్టుల అక్రిడిటేషన్ పొడిగింపు సరైంది కాదని అన్నారు. జర్నలిస్ట్ లకు కొత్త అక్రిడిటేషన్‌లు ఇవ్వాలని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy)కి లేఖ రాస్తానని స్పష్టం చేశారు. అలాగే రేపటి నిరుద్యోగుల ఛలో సెక్రటేరియట్ కార్యక్రమానికి జాగృతి సంపూర్ణ మద్దతు ఇస్తోందని స్పష్టం చేశారు. జాగృతి కార్యక్రమాలకు బీఆర్ఎస్ నాయకులు వస్తున్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జాగృతి నాయకులు పోటీ చేయాలని అనుకుంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు రాత పూర్వకంగా లేఖ రాయండి అంటూ మా కార్యకర్తలకు విజ్ఞప్తి చేసినట్లు స్పష్టం చేశారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే లక్ష్యంగా రైల్ రోకో కార్యక్రమ మద్దతు కోసం ఈ నెల 10న అన్ని పార్టీలకు లేఖ రాస్తానని చెప్పారు. అందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి కూడా లేఖ రాస్తానని చెప్పుకొచ్చారు. కాగా, రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ (గుర్తింపు కార్డు) గడువును మరో మూడు నెలల పాటు పొడిగిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సీహెచ్ ప్రియాంక ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 30వ తేదీతో అక్రిడిటేషన్ కార్డుల గడువు ముగియనుంది. తదితర కారణాల వల్ల ఈ గడువును మరో 3 నెలల పాటు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జూలై 1, నుంచి సెప్టెంబర్ 31 వరకు అక్రిడిటేషన్ కార్డుల గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.






