- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్నిసార్లు పసుపు బోర్డును ప్రారంభిస్తారు: ఎమ్మెల్సీ కవిత
పసుపు బోర్డును నిజామాబాద్లో ఇదివరకే రెండుసార్లు ప్రారంభించారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇప్పుడు మూడోసారి ప్రారంభించేందుకు వస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : పసుపు బోర్డును నిజామాబాద్లో ఇదివరకే రెండుసార్లు ప్రారంభించారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇప్పుడు మూడోసారి ప్రారంభించేందుకు వస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, పటాన్ చెరు, యాకుత్ పురా నియోజకవర్గాలకు చెందిన విద్యార్థులు, యువకులు శనివారం ఆమె సమక్షంలో తెలంగాణ జాగృతిలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పసుపు బోర్డుకు పదే పదే ప్రారంభోత్సవాలు చేయడం కాదని ఎన్ డీఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పసుపు బోర్డుకు చట్టబద్ధత కల్పించాలన్నారు. నిజామాబాద్ లోనే పసుపుకు క్వింటాల్ కు రూ.15 వేల మద్దతు ధర ప్రకటించి వెళ్లాలని డిమాండ్ చేశారు. పసుపు బోర్డుకు చట్టబద్ధత కల్పించక పోవడంతో మొన్నటి బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. నిజామాబాద్ జిల్లా రైతులు సంతోష పడేలా అమిత్ షా మద్దతు ధరపై స్పష్టత ఇవ్వాలని సూచించారు. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటోన్న సమస్యలను తెలంగాణ జాగృతి నుంచి లేవనెత్తుతుంటే కాంగ్రెస్ పార్టీ ఉలిక్కి పడుతోందన్నారు. కాంగ్రెస్ పాలనలో విద్యార్థులు, మహిళలు, అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ బతికి బట్టకట్టింది అంటే అది మహిళలతోనే అన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇందిరా గాంధీ, సోనియా గాంధీలే నిలబెట్టారని తెలిపారు. మహిళల గురించి జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలే కాంగ్రెస్ పార్టీ విధానమా అని సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ను ప్రశ్నించారు. మహిళలను తక్కువ చేసి మాట్లాడుతున్న జగ్గారెడ్డిని ఆయన భార్య, కూతురే సరి దిద్దాలన్నారు. బీసీల రిజర్వేషన్ల పెంపు బిల్లు కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉందని.. ఆ బిల్లును పాస్ చేస్తారా లేదా అన్న విషయంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
యువత రాజకీయాల్లోకి రావాలి :
యువత రాజకీయాల్లోకి రావాలని, జయశంకర్ సార్, కేసీఆర్ ఆలోచనల్లోంచి తెలంగాణ జాగృతి ఆవిర్భవించిందన్నారు. విద్యార్థులు, యువతకు ఎలాంటి సమస్యలున్నా వారి తరపున తెలంగాణ జాగృతి ఉద్యమిస్తుందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడటం మినహా ప్రజల కోసం చేసిందేమి లేదన్నారు. జై తెలంగాణ అనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని విమర్శించారు.
వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి :
గ్రామ రెవెన్యూ సేవకుల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏ జేఏసీ నాయకులు ఆమెను కలిసి తమ సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో 20,555 మంది వీఆర్ఏలు ఉండగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 16,758 మందికి వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు కల్పించారని తెలిపారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుండగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. 61 ఏళ్ల వయసు పైబడిన 3,797 మంది వీఆర్ఏల వారసులకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు.






