- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయ్ లాగే నేను గెలుస్తానని ప్రజలకు నమ్మకం కలిగింది: కవిత
మాజీ ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ పార్టీ అధినేత కవిత మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్ గెలుపుతో తెలంగాణలో ప్రజలకు తనపై కాన్ఫిడెన్స్ వచ్చిందని అన్నారు. పార్టీ పెట్టిన రెండేళ్లలోనే తాము అధికారంలోకి వస్తామని ముందు నుండి అనుకుంటున్నానని చెప్పారు.

దిశ, వెబ్ డెస్క్: మాజీ ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ పార్టీ అధినేత కవిత మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్ గెలుపుతో తెలంగాణలో ప్రజలకు తనపై కాన్ఫిడెన్స్ వచ్చిందని అన్నారు. పార్టీ పెట్టిన రెండేళ్లలోనే తాము అధికారంలోకి వస్తామని ముందు నుండి అనుకుంటున్నానని చెప్పారు. తమిళనాడులో విజయ్ గెలిచిన తరవాత, ఇక్కడ ప్రజలకు తనపై కాన్ఫిడెన్స్ వచ్చిందని అన్నారు. కొత్తవాళ్లకు పక్క రాష్ట్రంలో అధికారం ఇచ్చారు మనం కూడా ఇవ్వొచ్చని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. విజయ్ గెలిచిన తరవాత తమ కార్యకర్తలకు కూడా ఎంతో కాన్ఫిడెన్స్ వచ్చిందని తెలిపారు. గత రెండు మూడు ఏళ్లుగా తాను అనేక కష్టాలు పడ్డానని, ఈ రెండు మూడేళ్లలో అనేక మంది తనను ఫాలో అయ్యారని చెప్పారు.
తాను జైలులో ఉన్నప్పుడు, బయటకు వచ్చిన తరవాత తనతోనే ఉన్నారని తెలిపారు. ఇప్పుడు వాళ్ల ఫోర్స్ తో కొన్నివేల మంది జాగృతిలో చేరారని చెప్పారు. పార్టీ ఏర్పాటు చేసిన పదిరోజుల్లోనే తాము 119 నియోజకవర్గాల్లో జెండా పండుగ కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. పెద్ద పెద్ద పార్టీలకు కూడా జెండా పండుగకు అంతమంది ప్రజలు కనిపించరని చెప్పారు. తమది లీడర్ బేస్డ్ పార్టీ కాదని క్యాడర్ బేస్డ్ పార్టీ అని పేర్కొన్నారు. లీడర్ వస్తాడు పోతాడు కానీ క్యాడర్ ఎప్పటికీ ఉంటుందని అన్నారు. లీడర్ స్వార్థం చూసుకుంటాడు కానీ క్యాడర్ ప్రజల కోసం ఉంటుందన్నారు. తను ఓ గట్టి నాయకుడి వద్ద ట్రైనింగ్ అయ్యానని గెలుపు ఓటములను ఎలా ఎదుర్కోవాలో దగ్గర ఉండి చూశానని తెలిపారు. తాము కష్టాలల్లోనే రాటుదేలామని చెప్పారు.






