- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇది జాగృతి విజయం..స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై కవిత కీలక వ్యాఖ్యలు
by Ajay Maddhiboyina |
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తరవాతనే స్థానిక ఎన్నికలకు వెళతామని మంత్రి పొంగులేటి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తరవాతనే స్థానిక ఎన్నికలకు వెళతామని మంత్రి పొంగులేటి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. రిజర్వేషన్ల అమలుకు 2018లో తెచ్చిన చట్టాన్ని సవరించాలని చెప్పారు. కాగా పొంగులేటి ప్రకటనపై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. వెనుకబడిన తరగతులకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తరవాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే రాష్ట్ర మంత్రి వర్గ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ఈ విషయంలో అవసరమైన చర్యలు వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తెలంగాణ బీసీలు, తెలంగాణ జాగృతి విజయం అని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని తాము గట్టిగా డిమాండ్ చేశామన్నారు.
Next Story






