- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYD: గచ్చిబౌలి పీఎస్‌కు ఎమ్మెల్సీ కవిత.. ఉద్రిక్త వాతావరణం
బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యేలు హరీష్ రావు(Harish Rao), పాడి కౌశిక్ రెడ్డి(Kaushik Reddy)లను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యేలు హరీష్ రావు(Harish Rao), పాడి కౌశిక్ రెడ్డి(Kaushik Reddy)లను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బుధవారం పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని పలు సెక్షన్ల కింద కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. గురువారం ఉదయం అరెస్ట్ చేసేందుకు వెళ్లారు. ఆ సమయంలో కౌశిక్ రెడ్డికి మద్దతు ఇచ్చేందుకు వచ్చిన హరీష్ రావును సైతం అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఇద్దరూ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఉన్నారు. తాజాగా.. హరీష్ రావు, కౌశిక్ రెడ్డిని కలిసేందుకు ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఆమెతో పాటు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ప్రస్తుతం గచ్చిబౌలి పీఎస్ ఎదుట బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేస్తున్నారు. హరీష్ రావు, కౌశిక్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.






