మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు MLC కవిత ఫోన్.. కారణమిదే!

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-13 15:40:24  IST  )

ముస్లింలకు అత్యంత పవిత్రమైన మొహర్రంకు ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.

మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు MLC కవిత ఫోన్.. కారణమిదే!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముస్లింలకు అత్యంత పవిత్రమైన మొహర్రంకు ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో శుక్రవారం ఆమె ఫోన్‌లో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం 2023లో మొహర్రం నిర్వహణకు నిధులు విడుదల చేసిందని, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలేదని తెలిపారు. మొహర్రంకు ఏనుగుపై ఊరేగింపు తీయడం ముస్లింల సంప్రదాయమని గుర్తుచేశారు. 2024లో ఏనుగుపై ఊరేగింపు నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని.. ఇది ముస్లింల మనసులను గాయపరిచిందని వివరించారు. ప్రభుత్వం ఈసారి ఇలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని సూచించారు. మంత్రి అడ్లూరి స్పందిస్తూ నిధుల విడుదల అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని, మోహర్రంను సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు ఆదేశాలు ఇస్తానని హామీ ఇచ్చారు.

గద్దర్‌ను అవమానించారు..

ప్రజా గాయకుడు గద్దర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించిందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ప్రతి సందర్భంలో గద్దర్ పేరును జపం చేసే కాంగ్రెస్ సర్కార్.. ఆయన పేరు మీద ఇస్తున్న సినీ అవార్డుల ఆహ్వాన పత్రికలో గద్దర్ ఫొటో లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. కనీసం అవార్డుల పంపిణీ కార్యక్రమంలోనైనా వారి చిత్రపటాన్ని పెట్టి వారిని గౌరవించాలని కోరారు.

Next Story