పుంజాల్ మైదానంలో బతుకమ్మ వేడుకలు.. పాల్గొననున్న MLC కవిత

by Disha Web Desk 2 |
పుంజాల్ మైదానంలో బతుకమ్మ వేడుకలు.. పాల్గొననున్న MLC కవిత
X

దిశ, తెలంగాణ బ్యూరో: మహారాష్ట్రంలోని సోలాపూర్‌లో ఆదివారం జరగనున్న బతుకమ్మ సంబురాలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరుకానున్నారు. నగరంలోని పుంజాల్ మైదాన్‌లో జరిగే బతుకమ్మ పండుగ ఉత్సవంలో పెద్ద ఎత్తున పాల్గొననున్న ప్రవాస తెలంగాణ ఆడబిడ్డలతో కలిసి కవిత పాల్గొంటారు. నగరంలోని దత్తవాడ నుంచి సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే బతుకమ్మ శోభయాత్రలో పాల్గొని, 6 గంటలకు అక్కల్ కోట్ రోడ్‌లోని పుంజాల్ మైదాన్‌కు చేరుకొని బతుకమ్మ సంబురంలో పాల్గొంటారు. బతుకమ్మ సంబురాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు బీఆర్ఎస్ నాయకులు నాగేష్ వల్యాల్, దశరథ్ గోప్ తెలిపారు.

Next Story

Most Viewed