Breaking News: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్.. ఏ స్టేషన్‌‌కు తీసుకెళ్తున్నారో చెప్పట్లేదని కార్యకర్తల ఆగ్రహం

by Ramesh Naini |

విద్యార్థులు, జనరల్ బస్‌పాస్‌ల చార్జీలను తాజాగా తెలంగాణ ఆర్టీసీ పెంచిన దాదాపు దాదాపు 20 శాతం విషయం తెలిసిందే.

Breaking News: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్.. ఏ స్టేషన్‌‌కు తీసుకెళ్తున్నారో చెప్పట్లేదని కార్యకర్తల ఆగ్రహం
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: విద్యార్థులు, జనరల్ బస్‌పాస్‌ల చార్జీలను తాజాగా తెలంగాణ ఆర్టీసీ పెంచిన దాదాపు దాదాపు 20 శాతం విషయం తెలిసిందే. దీంతో ప్రజలు, విద్యార్థులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే భవన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ఆధ్వర్యంలో బస్ పాస్ ధరల పెంపునకు నిరసనగా ఇవాళ బస్ భవన్ ముట్టడికి యత్నించారు. పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలతో కలిసి బస్ భవన్‌ ఎదుట ఎమ్మెల్సీ కవిత బైటాయించారు. ఈ క్రమంలోనే ఘర్షణ వాతావరణం ఏర్పడటంతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ.. వెంటనే ఆర్టీసీ పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బస్‌పాస్ ధరలను పెంచి ప్రజలపై ప్రభుత్వం పెనుభారాన్ని మోపిందని మండిపడ్డారు. విద్యార్థులు, చిరుద్యోగులపై తీవ్రంగా ఆర్థిక భారం పడుతుందని, బస్‌పాస్ ధరలను పెంచి ప్రజలపై గుదిబండను మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పెంపుతో ఒక్క ప్రయాణికుడిపై నెలకు దాదాపు రూ. 300 పైగా భారం పడుతుందని అంచనా వేశారు. మరోవైపు అనేక రూట్లలో విద్యార్థుల కోసం బస్సులు నడపడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయని, ప్రజలను దోచుకోవడానికి ప్రభుత్వం అలవాటు పడిందన్నారు. ఎమ్మెల్సీ కవితను తొలుత చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్‌కు పోలీసులు తరలించారు. ఇప్పుడు కంచన్ బాగ్ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇంతకు ఏ పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారో స్పష్టంగా చెప్పడం లేదని పోలీసులపై తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా, అంతకు ముందు బీఆర్ఎస్‌వీ నేతలు బస్‌భవన్ ఎదుట మెరుపు ధర్నాకు దిగారు. రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. బీఆర్ఎస్‌వీ శ్రేణులు, బీఆర్ఎస్‌వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచడం వల్ల పేద విద్యార్థులపై ఆర్థిక భారం పడుతుందని, ఒక్కో విద్యార్థిపై రూ. 250 నుంచి రూ. 350 వరకు భారం పడుతోందని ఈ సందర్బంగా బీఆర్ఎస్‌వీ నాయకులు తెలిపారు.

Next Story