- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలిగా కవిత
సింగరేణిలోని హెచ్ఎంఎస్ (ది సింగరేణి మైనర్స్ అండ్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్) గౌరవ అధ్యక్షురాలిగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ

దిశ, తెలంగాణ బ్యూరో: సింగరేణిలోని హెచ్ఎంఎస్ (ది సింగరేణి మైనర్స్ అండ్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్) గౌరవ అధ్యక్షురాలిగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో నిర్వహించిన హెచ్ఎంఎస్ జనరల్ బాడీ మీటింగులో సంఘం ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ కవితను గౌరవ అధ్యక్షురాలిగా ఎన్నుకుంటున్నట్టు ప్రతిపాదించగా సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. పాత వీఆర్ఎస్ స్కీమ్‌ను పునరుద్ధరించడం, వేలంపాట లేకుండా తెలంగాణ బొగ్గు బ్లాక్‌లను సింగరేణి కేటాయించడం, సింగరేణి కార్మికులకు పెర్క్స్ రీయింబర్స్‌మెంట్ కింద ఐటీ రిటర్న్స్ ఇప్పించడం, సింగరేణిలో అలియాస్ నేమకనిపించడమారుపేరుల సమస్యతో బాధపడుతున్న కార్మికులను వన్ టైం సెటిల్మెంట్ కింద క్రమబద్ధీకరించడం, అనారోగ్య సమస్యలతో అండర్ గ్రౌండ్ అన్‌ఫిట్ అయి సర్ఫేస్ ఫిట్ తీసుకున్న సింగరేణి కార్మికునికి బేసిక్ ప్రొటెక్షన్, సూటబుల్ జాబ్ ఇప్పించడం, కార్మికులకు సొంత ఇంటి పథకం అమలు చేయడం, సింగరేణిలో పెండింగ్ విజిలెన్స్ కేసులను క్రమబద్ధీకరించడం, జైపూర్ పవర్ ప్లాంట్‌లో పనిచేస్తున్న భూనిర్వాసితులకు రెగ్యులరైజ్ చేయడం, సింగరేణి కార్మికులకు కంపెనీ లాభాల వాటా 35% ఇప్పించడం, సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్స్‌కి కంపెనీ లాభాల్లో 10% వాటా ఇప్పించడం, సింగరేణిలో పనిచేస్తున్న మహిళలకు వాళ్ల విద్యార్హతకు తగిన ఉద్యోగాలు కల్పించడంపై తీర్మానాలు చేశారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి హోం మంత్రిగా పనిచేసిన కాలం వరకు హెచ్ఎంఎస్‌కు గౌరవ అధ్యక్షుడిగా నాయిని నర్సింహారెడ్డి పనిచేశారు. ఆయన తర్వాత హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలిగా కల్వకుంట్ల కవిత ఎన్నికయ్యారు.






