- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MLC Elections: హాట్ సీట్‌గా కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానం.. హోరాహోరీగా జరగనున్న ఎన్నిక
కరీంనగర్ గ్రాడ్యుయే ట్ శాసనమండలి ఎన్నిక అన్ని పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది.

దిశ, తెలంగాణ బ్యూరో : కరీంనగర్ గ్రాడ్యుయే ట్ శాసనమండలి ఎన్నిక అన్ని పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. మూడు పార్టీలకు సంబంధించిన అగ్రనాయకత్వం ఈ నియోజకవర్గ పరిధిలో ఉండటంతో ఈ ఎన్నిక హాట్ టాపిక్ గా మారింది. ఈ స్థానంలో గెలవడం రాజకీయ పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. షెడ్యూల్ రావడంతో ఒక్కసారి ఎన్నిక హీటెక్కింది. కరీంనగర్ పరిధిలోకి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాలు వస్తాయి. కొత్త జిల్లాల ను పరిగణలోకి తీసుకుంటే 15 జిల్లాలు, ఆరు లోక్సభ నియోజకవర్గాలు, 42 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. ఈ నెల 6న ప్రకటించిన ఓటరు తుది జాబితాలో 3.41లక్షల ఓటర్లు ఉన్నారు.
కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల్లో 15 కొత్త జిల్లాలు, ఆరు లోక్సభ నియోజకవర్గాలు, 42 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్రెడ్డి గెలుపొందారు. దీంతో కాంగ్రెస్పార్టీకి సరికొత్త ఉత్సాహం వచ్చింది. బీఆర్ఎస్ ఎన్నికల్లో పోటీచేయరాదని నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. గత ఎన్నికల్లోనూ ఇక్కడి నుంచి పార్టీ అభ్యర్థి ఎవరూ పోటీ చేయలేదు. అయితే ఇండిపెండెంట్గా పోటీ చేసిన రవాణా శాఖ అధికారి చంద్రశేఖర్గౌడ్కు మద్దతు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేయడానికి పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులఅభిప్రాయాలను సేకరించింది. వీటన్నింటిని మరోసారి చర్చించి అభ్యర్థి పేరుపై అదిష్టానానికి నివేదిక ఇవ్వనున్నారు. త్వరలో అభ్యర్థిని అధికారికంగా ప్రకటించనున్నారు. మొత్తంగా మూడు పార్టీలకు ఈ ఎన్నికల ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఫలితం ఏ విధంగా ఉంటుందో వేచిచూడాల్సిందే.
* కరీంనగర్ నియోజకవర్గ పరిధిలోనే పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఉన్నారు. ఆయనకు ఈ ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారింది. పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన తరువాత తొలిసారి ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాంగ్రెస్ వచ్చాక ఉద్యోగ నియామకాలు సాఫిగా సాగుతున్నాయి. ఎక్కడా కూడా కోర్టు కేసులు, లీకేజీలు లేకుండా సజావుగా జరగడంతో నిరుద్యోగులకు ప్రభుత్వంపై నమ్మకం పెరిగింది.
* బీజేపీకి ఉత్తర తెలంగాణ కీలకంగా మారింది. పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉన్నారు. ఒకప్పుడు హైదరాబాద్ పార్టీగా ప్రచారం జరిగిన బీజేపీకి ఇప్పుడు ఉత్తర తెలంగాణలో పట్టు సాధించింది. ఇక్కడి నుంచే కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, నలుగురు ఎంపీలున్నారు. పార్టీకి ఉన్న ఎనిమిది మంది ఎమ్మెల్యేల్లో ఏడుగురు ఈజిల్లాల పరిధిలోనే ఉన్నారు.
* బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు , ఎమ్మెల్సీ కవిత సహా పలువురు ముఖ్య నేతలు ఈ నియోజకవర్గానికి చెందిన నేతలే. అగ్రనాయకులంతా ఇక్కడి నియోజకవర్గానికి చెందిన వారే కావడంతో ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని ప్రణాళికలు వేస్తున్నారు. తాము నిలబడితే సులువుగా గెలవచ్చని అంచనా వేసిన బీఆర్ఎస్ చివరికి.. పోటీ చేయకూడదని నిర్ణయించింది.
‘కరీంనగర్’ పరిధిలో అగ్రనేతలు..
కాంగ్రెస్: పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్గౌడ్, మంత్రులు దామోదర్ రాజనర్సింహ, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, ఎంపీలు గడ్డం వంశీ, సురేశ్షెట్కార్, పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు
బీజేపీ: కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు ధర్మపురి అరవింద్, నగేశ్, రఘనందన్రావు, ఎనిమిది మంది ఎమ్మెల్యేల్లో ఏడుగురు ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం
బీఆర్ఎస్: బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీ కవిత, 15 మంది ఎమ్మెల్యేలు






