- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేవంత్ రెడ్డిది మూడు రూపాయల మైండ్‌సెట్ : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
సీఎం రేవంత్ రెడ్డి ఓయూ పర్యటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్రంగా మండిపడ్డారు.

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి ఓయూ పర్యటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్రంగా మండిపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీ తనకు కన్నతల్లిలాంటిదని గుర్తుచేసుకున్న దాసోజు శ్రవణ్.. రేవంత్ రెడ్డి ఓయూ పర్యటనలో చేసిన ప్రసంగం విషపూరితంగా, గందరగోళంగా ఉందని శ్రవణ్ విమర్శించారు. మూడు రూపాయల మైండ్‌సెట్‌తో మూడు ట్రిలియన్ ఎకానమీ సాధ్యం కాదని, తెలంగాణ రైజింగ్ కాదు రావేజింగ్ దశలోకి వెళ్లిందని ఎద్దేవా చేశారు.
కేసీఆర్‌పై ద్వేషంతోనే సీఎం ప్రతి వేదికను దుర్వినియోగం చేస్తున్నారని, ఫ్యూడల్ మనస్తత్వంతో గురుకులాలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. నల్లమలపై రేవంత్‌కు ఎలాంటి సంబంధంలేదని, ఉద్యమం గురించి మాట్లాడటం సిగ్గుచేటని శ్రవణ్ ఎద్దేవా చేశారు. రేవంత్ చదువు కాదు, ఆయన తీరు సమస్య అని వ్యాఖ్యానిస్తూ.. ఎస్సీ వర్గీకరణ, కులగణన, గురుకులాల బలోపేతం వంటి అంశాల్లో సీఎం వ్యాఖ్యలు పూర్తిగా అబద్దమని అన్నారు.






