కేసీఆర్‌ను కలిసిన MLC అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి?

by Gantepaka Srikanth |

తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. నల్గొండ - వరంగల్‌ - ఖమ్మం ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీగా గెలుపొందిన PRTU అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి(Pingili Sripal Reddy) కేసీఆర్‌ను కలిసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కేసీఆర్‌ను కలిసిన MLC అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. నల్గొండ - వరంగల్‌ - ఖమ్మం ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీగా గెలుపొందిన PRTU అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి(Pingili Sripal Reddy) కేసీఆర్‌ను కలిసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బుధవారం ఎర్రవల్లి నివాసం(Erravalli Residence)లో కేసీఆర్‌(KCR)ను కలిసినట్లు సమాచారం. ఎన్నికలు జరిగిన తీరు, తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు చర్చించుకున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. నల్గొండ - వరంగల్‌ - ఖమ్మం ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానంలో పీఆర్‌టీయూ తెలంగాణ అభ్యర్థి పింగిళి శ్రీపాల్‌రెడ్డి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మెుత్తం 19 మంది అభ్యర్థులు పోటీలో నిలవగా.. మెుదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలలేదు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 13969 ఓట్లతో శ్రీపాల్ రెడ్డి గెలుపొందారు.

Next Story