డీసీసీ అధ్యక్షుల నియామకం కోసం నూతన విధానం.. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Ramesh Naini |   (  Updated:2025-10-14 13:38:08  IST  )

దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో డీసీసీ అధ్యక్షుల నియామకం కోసం నూతన విధానం చేపట్టామని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు.

డీసీసీ అధ్యక్షుల నియామకం కోసం నూతన విధానం.. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో (DCC presidents) డీసీసీ అధ్యక్షుల నియామకం కోసం నూతన విధానం చేపట్టామని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ (MLC Balmoor Venkat) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆదేశాల మేరకు డీసీసీ అధ్యక్షుల నూతన విధానం చేపట్టినట్లు తెలిపారు. మంగళవారం బోధన్ నియోజకవర్గంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు.. డీసీసీ అధ్యక్షుడి నియామకం కోసం పార్టీలోని జిల్లా స్థాయి సీనియర్ నాయకులు, ఆశావాహులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఒక్కొక్కరిగా వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. వారం రోజుల పాటు జిల్లాలోని నియోజకవర్గాల్లో బ్లాక్‌ల వారీగా నేతలు, నాయకుల అభిప్రాయాలు తీసుకుని హై కమాండ్‌కు నివేదిక ఇస్తామని ఏఐసీసీ పరిశీలకులు ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఏఐసీసీ పరిశీలకులు, ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూరి వెంకట్ డీసీసీ అధ్యక్షుడి నియామకం కోసం జరిగే ప్రక్రియ, విధి విధానాలను వివరించారు.

Next Story