రాళ్లతో కొట్టే పరిస్థితి వస్తుంది..కేటీఆర్ కు బల్మూరి వార్నింగ్

by velandi.Saikiran |

గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుకు ( KTR ) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల

రాళ్లతో కొట్టే పరిస్థితి వస్తుంది..కేటీఆర్ కు బల్మూరి వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుకు ( KTR ) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ (MLC Balmuri Venkat). పిచ్చికుక్కలా మాట్లాడితే.. రాళ్లతో కొట్టే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఇవాళ ఉదయం నుంచి... కేటీఆర్ వర్సెస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిపై చర్చకు రావాలని కేటీఆర్... సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు వెళ్లారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ( Cm Revanth reddy) పాటు... కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు కేటీఆర్. అయితే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ పై విరుచుకుపడ్డారు బల్మూరి వెంకట్. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే రాళ్లతో కొట్టే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.

నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే... మీ నాన్నను అసెంబ్లీకి తీసుకురా... అప్పుడు చర్చ పెడదామని సవాల్ విసిరారు. ముందు నీ ఇంట్లో వివాదాలు చక్కదిద్దుకో అంటూ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం... తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడుపుతోందని... స్పష్టం చేశారు. కాంగ్రెస్ పైన తెలంగాణ ప్రజలకు నమ్మకం ఉందన్నారు.

Next Story