- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సభలో కేసీఆర్ వీటికి సమాధానం చెప్పాల్సిందే.. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆసక్తికర ప్రశ్నలివే!
రజతోత్సవ సంబరాలు జరుపుకుంటున్న వేళ తెలంగాణ సమాజం అడుగుతున్న ప్రశ్నలకు మాజీ సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పలు ప్రశ్నలు పంచుకున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: (BRS Warangal Sabha) రజతోత్సవ సంబరాలు జరుపుకుంటున్న వేళ తెలంగాణ సమాజం అడుగుతున్న ప్రశ్నలకు మాజీ సీఎం కేసీఆర్ (KCR) సమాధానం చెప్పాలని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ (Balmuri Venkat) పలు ప్రశ్నలు వేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఎక్స్ వేదికగా ఒక ప్రకటనలో తెలిపారు. ‘15 నెలలుగా ప్రతిపక్ష నేతగా ప్రజల్లోకి రాకుండా, చట్టసభలకు వెళ్లకుండా ఫాంహౌజ్ కే పరిమితమై.. 25 ఏండ్ల పార్టీ పండగ చేసుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రజలకు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి. ఏ నీళ్లు, నిధులు, నియామకాల కోసమైతే తెలంగాణ సమాజం పోరాటం చేసిందో.. వాటిని పదేళ్లలో ఎందుకు పట్టించుకోలేదో ప్రజలకు చెప్పాలి. మీ గులాబీ పండుగ.. పదేళ్లలో ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేసినందుకా సమాధానం ఇవ్వాలి? ఇంటికో ఉద్యోగం అన్నాము, కనీసం ఊరికో ఉద్యోగం ఇవ్వలేకపోయామనా? ప్రత్యేక రాష్ట్ర పోరాటానికి యుద్ధభూములుగా నిలిచిన యూనివర్సిటీల్లో మీ పాలనలో ఒక్క పోస్ట్ కూడా ఎందుకు భర్తీ చేయలేదో చెప్పాలి. పదేళ్లలో బీసీల రిజర్వేషన్లు పెంచకుండా సబ్బండ వర్గాలను ఎందుకు మోసం చేశారో చెప్పాలి? 10 ఏళ్లుగా దళితుడిని cm చేస్తానని దళిత బిడ్డలను ధగా చేసినందుకా? పదేళ్లలో Sc వర్గీకరణను చేయలేక, మోసం చేశామనా? తొలి కేబినెట్ లో మహిళా మంత్రి లేకుండానే పాలన సాగించి నందుకా? డబుల్ బెడ్ రూం ఇండ్లని ఇల్లు పీకి పందిరేసినందుకా? కమీషన్ల కోసం కాళేశ్వరం కట్టి, ప్రజల నెత్తిన అప్పుల భారం మోపినందుకా? సిరిగల తెలంగాణాను పదేళ్లలో అప్పుల తెలంగాణగా మార్చినందుకా? ముందు తెలంగాణ సమాజానికి అన్నింటికి సమాధానం చెప్పాలి’ అని పేర్కొన్నారు.
‘పదేళ్లు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిన ప్రజలే ఇప్పుడు ప్రతిపక్ష నేతగా తమ సమస్యలపై పోరాడమని అవకాశం ఇస్తే.. అసెంబ్లీకి సైతం రాకుండా చట్టసభలను అవమానిస్తూ ఫాంహౌజుకే ఎందుకు పరిమితం అయ్యారో చెప్పాలి. ప్రజల కోసం 15 నెలలుగా పబ్లిక్ లోకి రాని కేసీఆర్ పార్టీ రజతోత్సవాలకు మాత్రం పరుగులు తీస్తున్నారు. తెలంగాణ కోసం తమ విలువైన ప్రాణాలను బలి దానమిచ్చిన వందలాది మంది అమరవీరుల కుటుంబాలకు ఏం చేశారో చెప్పాలి. ఘనత వహించిన మీ నాయకత్వంలో మీ పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని నిరుద్యోగ తెలంగాణ, అప్పుల తెలంగాణ, ఆత్మహత్యల తెలంగాణ గా ఎందుకైందో ముందు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి’ అని వెంకట్ బల్మూరి ప్రశ్నలు వేశారు.






